పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనియా ఏ రేంజ్ ఉంటుందో చెప్పే పరిస్థితులు ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలను పురస్కరించుకొని పవన్ సొంతూరులోని థియేటర్లు అన్నీ మొదటి రోజున కూల్ డ్రింక్స్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలోని ఒక హోటల్ లో అయితే ఏకంగా సర్దార్ గబ్బర్ సింగ్ మెనూను సిద్దం చేశారు.
మెనూ అంటే మెనూలా కాకుండా.. సర్దార్ చమక్కులు అందులో ఉండటం విశేషం. ఈ మెనూకు ట్యాగ్ లైన్ ఏం పెట్టారో తెలుసా.. ‘‘సర్దార్ గబ్బర్ సింగ్ ఆఫర్. మా ఆఫర్ కి కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’’ అని పెట్టేశారు. ఇంతకీ సర్దార్ మెనూలో ఏమున్నాయంటే.. సర్దార్ స్పైస్ రైస్.. కాజల్ కర్డ్ రైస్.. బుల్లెట్ స్నాక్స్.. డీఎస్పీ కర్రీలు ఉన్నాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో సర్దార్ గబ్బర్ సింగ్ మేనియా కాస్త ఎక్కువగా ఉంది సుమా.