మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` జనవరి 11న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. రిలీజ్ ముంగిట ఫ్యాన్స్ లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్లు.. టీజర్ల కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో పాటని మేకర్స్ సోమవారం విడుదల చేశారు.
తాజాగా `డ్యాంగ్ డ్యాంగ్..` అంటూ సాగే ఈ పార్టీ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ పాటలో మహేష్ తో సైనికుల బృందం తో కలిసి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నృత్యం ఫ్యాన్స్ ని హీటెక్కించింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్ నివ్వగా.. దేవీశ్రీ సంగీతం అందించారు. బోర్డర్లో సైనికులంతా ఓ ఆపరేషన్ తరువాత జరుపుకునే సక్సెస్ సంబరం నేపథ్యంలో జరుపుకునే పార్టీ సాంగ్ ఇది. అందుకు తగ్గట్టే కాస్త హాట్ గానే ఈ పాటను చిత్రీకరించారు. అయితే సాధారణంగా తెలుగు సినిమాల్లో వుండే ఐటమ్ సాంగ్ ఇది అంటూ సోషల్ మీడియాల్లో అంతా పొరపాటున రాశారు. దీనిపై స్వయంగా హీరో మహేష్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
"ఇది ఐటమ్ సాంగ్ కాదని.. ఇదొక పార్టీ సాంగ్ అని మా దర్శకుడు కరెక్ట్ గానే చెప్పారు. డ్యాంగ్ డ్యాంగ్ ప్రోమోని చూసి ఎంజాయ్ చేయండి" అని హీరో మహేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఆర్మీ క్యాంప్ లో ఐటెమ్ గీతం అంటే రివల్యూషన్ ఏవిధంగా ఉంటుందో ఊహించేదే. అసలే మనోభావాలు దెబ్బ తినే కాలమిది. అదేదో సినిమాలో చేశారులే! అనేస్తే కుదరదు. అందుకే మహేష్ కాస్త అలెర్ట్ అయినట్టే కనిపిస్తోంది. అయితే మరీ అంత హాటీని బరిలో దించడంతోనే చిక్కొచ్చి పడింది. అసలే మిల్కీ వైట్ అందం.. ఆపై నాభి సౌందర్యాన్ని ఎలివేట్ చేస్తూ తమన్నా వేసిన స్టెప్పులు కిరాక్ పుట్టించాయి. ఎంత ఆర్మీ ట్రాక్ వేసుకుంటే మాత్రం ఐటెమ్ అని భావించేంతగా స్టెప్పుల్ని కంపోజ్ చేశారు మరి. అయితే దీనిని అలవాట్లో పొరపాటుగా ఈ గీతాన్ని ఐటమ్ పాట అని అనుకునే ప్రమాదం వుందని గ్రహించిన మహేష్ ముందుగానే తేరుకుని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం చర్చకొచ్చింది.