స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రీరిలీజ్ బిజినెస్

Update: 2020-01-08 03:59 GMT
సంక్రాంతి బిగ్ ఫైట్ లో స‌రిలేరు నీకెవ్వ‌రు - అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల మ‌ధ్య ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌మోష‌న్.. ప్రీరిలీజ్ బిజినెస్ స‌హా అన్ని కోణాల్లోనూ పోటీ నెల‌కొంది. తాజా స‌మాచారం ప్రకారం.. అల వైకుంఠ‌పురములో చిత్రం 85 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేయ‌గా 120కోట్లు పైగా అన్ని ర‌కాలుగా బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది. అలాగే మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం దాదాపు 100 కోట్ల మేర వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ బిజినెస్ చేయ‌గా.. 77 కోట్ల మేర తెలుగు రాష్ట్రాల్లో ప్రీరిలీజ్ బిజినెస్ సాగించింద‌ని తెలుస్తోంది. నాన్ థియేట్రిక‌ల్ క‌లుపుకుని సుమారు 120కోట్ల మేర బిజినెస్ సాగింద‌న్న అంచ‌నాలు వెల్ల‌డ‌య్యాయి.

సరిలేరు నీకెవ్వ‌రు ఏరియా వైజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రిశీలిస్తే.. నైజాం-25కోట్లు.. సీడెడ్-12కోట్లు.. కృష్ణ‌-6.30కోట్లు.. గుంటూరు -7.50కోట్లు.. నెల్లూరు -3.20కోట్లు..ప‌.గో జిల్లా-5.50కోట్లు.. తూ.గో జిల్లా-7.50కోట్లు.. ఉత్త‌రాంధ్ర 9.60కోట్ల మేర బిజినెస్ చేసింది. ఓవ‌రాల్ గా ఏపీ - తెలంగాణ క‌లుపుకుని 76.60 కోట్ల బిజినెస్ సాగింది. క‌ర్నాట‌క -8.30కోట్లు.. రెస్టాఫ్ ఇండియా -1.80కోట్లు... ఓవ‌ర్సీస్ -13.60కోట్లు క‌లుపుకుని ఓవ‌రాల్ గా 100.60కోట్ల మేర బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది.

ఇక నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ మ‌రో 54కోట్ల మేర సాగింద‌న్న అంచ‌నాలున్నాయి. ఓవ‌రాల్ గా స‌రిలేరు నీకెవ్వ‌రు 154కోట్ల బిజినెస్ సాగించింద‌ని డిస్ట్రిబ్యూట‌ర్ వాట్సాప్ గ్రూపుల వివ‌రాలు వెల్ల‌డిస్తున్నాయి. ప్రీబిజినెస్ ని బ‌ట్టి స‌రిలేరు చిత్రం థియేట‌ర్ల నుంచి 100కోట్లు పైగా షేర్ వ‌సూలు చేయాల్సి ఉంద‌న్న చ‌ర్చా పంపిణీ వ‌ర్గ‌ల్లో సాగుతోంది.
Tags:    

Similar News