చిత్రం : 'సరిలేరు నీకెవ్వరు'
నటీనటులు: మహేష్ బాబు - రష్మిక మందన్న - విజయశాంతి - ప్రకాష్ రాజ్ - రాజేంద్ర ప్రసాద్ - సంగీత - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు - హరితేజ - బండ్ల గణేష్ - అజయ్ - రఘుబాబు తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: అనిల్ సుంకర - దిల్ రాజు
రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి
తనను పక్కా మాస్ మసాలా సినిమాలో చూడాలన్న అభిమానుల కోరికను తీరుస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రమిది. ప్రోమోలు చూస్తే పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లా కనిపించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) ఆర్మీలో మేజర్. ఎవరూ లేని అనాథ అయిన అతడికి దేశమే అంతా. అక్కడ సాహసోపేత ఆపరేషన్లలో పాల్గొని గొప్ప పేరు సంపాదించిన అతను.. ఒక రెస్క్యూ మిషన్లో భాగంగా ప్రాణాపాయ స్థితికి చేరిన అజయ్ (సత్యదేవ్) తరఫున అతడి ఇంటికి పెళ్లి బాధ్యతలు చూడటానికి వెళ్తాడు. ఐతే కర్నూలులో ఉండే సత్యదేవ్ తల్లి అయిన ప్రొఫెసర్ భారతి (విజయశాంతి)కి, ఆమె కుటుంబ సభ్యులకు అక్కడి మంత్రి నాగేంద్ర (ప్రకాష్ రాజ్) వల్ల ప్రాణాపాయ పరిస్థిితి తలెత్తుతుంది. ఇంతకీ మంత్రికి, భారతికి ఉన్న గొడవేంటి.. చిక్కుల్లో ఉన్న భారతి కోసం అజయ్ ఏం చేశాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
సినిమాల విషయానికి వస్తే ‘ట్రెండ్’ అనే ఒక మాట ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఒక్కో కాలంలో ఒక్కో రకమైన సినిమాలు బాగా ఆడుతుంటాయి. అయితే అన్ని కాలాల్లోనూ ఆడే మినిమం గ్యారెంటీ ‘కమర్షియల్’ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములాను ఔపాసన పట్టి స్టార్ హీరోల్ని పెట్టి హిట్లు కొట్టే దర్శకులు కొందరుంటారు. వీళ్లు కమర్షియల్ కథల్ని వండడంలో.. వాటికి సరిగ్గా మసాలాలు అద్ది మాస్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించడంలో విజయవంతం అవుతుంటారు. ఒకప్పుడు వి.వి.వినాయక్.. ఆ తర్వాత శ్రీను వైట్ల.. ఇప్పుడేమో అనిల్ రావిపూడి ఆ కోవకు చెందిన వాళ్లే. ముందు చెప్పుకున్న ఇద్దరూ ఔట్ డేట్ అయిపోగా.. ఇప్పుడు అనిల్ టైం నడుస్తోంది. అతడి సినిమాల్లో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కానీ అతను ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాడు. రొటీన్ అనుకుంటూనే ఎంజాయ్ చేసేలా ఉంటాయి అతడి సినిమాలు. ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా ఆ కోవలోని సినిమానే. మహేష్ బాబు అభిమానులు తమ హీరోను ఎలా చూడాలని అనుకుంటారో అలా చూపిస్తూ.. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మలిచాడు అనిల్. కథా కథనాల్లో మరీ ఫార్ములాటిగ్గా ఉండటం.. కొన్ని చోట్ల సాగతీత ప్రేక్షకుల్ని అసహనానికి గురి చేస్తాయి కానీ.. మహేష్ అభిమానులు, మాస్ ప్రేక్షకులకు మాత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ వినోదాన్నందించే చిత్రమే.
మహేష్ బాబును చాలామంది దర్శకులు ముభావంగా.. సీరియస్ గా కనిపించే పాత్రల్లోనే చూపించారు, అతను కూడా ఎక్కువగా అలాంటి పాత్రల వైపే మొగ్గు చూపాడు కానీ.. నిజానికి అతను ఎనర్జిటిక్.. ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లలోనే ప్రత్యేకంగా కనిపిస్తాడు. అతను కామెడీ చేస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందుకు ‘దూకుడు’ ఒక ఉదాహరణ. సరిగ్గా ఆడకపోయినా ‘ఖలేజా’లో మహేష్ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ సినిమాల్ని గుర్తుకు తెస్తూ ‘సరిలేరు నీకెవ్వరు’లో అభిమానుల్ని ఉర్రూతలూగించాడు మహేష్. కామెడీలో కావచ్చు.. ఫైట్లలో కావచ్చు.. డ్యాన్సుల్లో కావచ్చు.. మహేష్ గత కొన్నేళ్లలో ఇంత ఎనర్జీ ఉన్న పాత్ర చేయలేదు. తనకు తాను గీసుకున్న పరిమితుల్ని ఛేదిస్తూ.. అనిల్ రావిపూడి కోరుకున్న దాన్ని మించిన ఎనర్జీ చూపిస్తూ.. చాలా ఎంజాయ్ చేస్తూ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ ఇచ్చిన పెర్ఫామెన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’కు అతి పెద్ద ఆకర్షణ. ఇప్పటిదాకా కామెడీనే ప్రధానంగా సినిమాలు నడిపించిన అనిల్.. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా అనేసరికి హీరో ఎలివేషన్ల మీదే ఫోకస్ పెట్టడం విశేషం. తన బలమైన కామెడీలో ఈసారి అతను బలహీనపడిపోయాడు. కామెడీ అసలు వర్కవుట్ కాలేదని చెప్పలేం కానీ.. సినిమాలో హైలైట్ అయింది మహేషే. హీరో ఎలివేషన్ సీన్లలో రెచ్చిపోవడమే కాదు.. అవసరమైనపుడు కామెడీ కూడా చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశాడు మహేష్.
‘సరిలేరు..’ టీజర్ - ట్రైలర్ చూసినపుడే ఇది ఏ తరహా సినిమా అన్నది ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేసింది. ఇందులో చెప్పుకోదగ్గ కథేమీ ఉండదని.. ఒక ప్యాకేజీలా ఈ సినిమాను మలిచి ఉంటారని అర్థమైపోయింది. ఎన్నో కమర్షియల్ సినిమాలు చూసిన అనుభవంతో సినిమాలో ఆడియోలో విన్న ఏ పాట ఎప్పుడొస్తుంది.. ట్రైలర్లో చూసిన ఏ ఫైట్ ఎప్పుడుంటుంది.. ఏ డైలాగ్ ఏ సందర్భంలో పడుతుందన్నది కూడా ప్రేక్షకులు అంచనా వేసేశారు. ఆ అంచనాలకు ఏమాత్రం భిన్నంగా సాగదీ సినిమా. ఆరంభం నుంచి ఒక ఫార్ములా ప్రకారం నడిచిపోయే సినిమాలో ఆరంభం నుంచి హీరో ఎలివేషన్ల మీదే దర్శకుడు దృష్టిపెట్టాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు రొటీన్ అనిపించినప్పటికీ వినోదాన్ని పంచుతాయి. చిన్నపిల్లల్ని ఉగ్రవాదుల నుంచి కాపాడే రెస్క్యూ ఆపరేషన్లో మహేష్ ఎనర్జీకి తోడు యాక్షన్ కూడా ఆకట్టుకుంటుంది. సైనికులంతా కలిసి తమన్నాతో స్టెప్పులేస్తూ పార్టీ చేసుకోవడం చూస్తేనే ‘సరిలేరు..’ పక్కా కమర్షియల్ మీటర్లో సాగే సినిమా అనే విషయం ఆరంభంలోనే అర్థమైపోతుంది. హీరోను నామమాత్రంగా సైనికుడిలా చూపించి ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి మొక్కుబడి కారణం చూపిస్తారు. ఇక అక్కడి నుంచి పూర్తిగా అనిల్ రావిపూడి స్టయిల్లోకి మారిపోతుంది సినిమా. ఐతే అనిల్ సహా చిత్ర బృందమంతా ఓ రేంజిలో చెప్పుకున్న ట్రైన్ ఎపిసోడ్ అనుకున్న స్థాయిలో నవ్వులు పంచలేకపోయింది. కొంచెం టైంపాస్ చేయించినప్పటికీ.. హీరోయిన్ - ఆమె కుటుంబ సభ్యుల ‘అతి’ శ్రుతిమించి అసహనం కూడా కలుగుతుంది. ఐతే ఈ ఎపిసోడ్‌ను మరీ సాగదీయకుండా మధ్యలో కట్ చేసి కర్నూలుకు తీసుకెళ్లి.. కొంత కథను నడిపించి.. ఆ తర్వాత కొండారెడ్డి బురుజు దగ్గర మాస్ ట్రీట్ ఇచ్చాడు అనిల్. ఇక్కడ రాజమౌళి.. సురేందర్ రెడ్డి సినిమాల స్థాయిలో హీరో ఎలివేషన్ కనిపిస్తుంది. అభిమానులకు ఈ ఎపిసోడ్ కనువిందే. మహేష్ ఎనర్జీ.. అతడి డైలాగులు ఉర్రూతలూగిస్తాయి.
ఐతే ఇంకొన్ని నిమిషాల్లో బొమ్మ దద్దరిల్లిపోతుంది అంటూ ఇంటర్వెల్ దగ్గర ఊరించిన అనిల్ రావిపూడి.. ద్వితీయార్ధాన్ని మాత్రం అనుకున్న స్థాయిలో నడిపించలేకపోయాడు. హీరో విలన్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కాసేపు బాగానే సందడి చేసినా.. విలన్ పాత్రను అతడి ముందే తుస్సుమనిపించేయడంతో ఆ తర్వాత సంఘర్షణకే తావు లేకపోయింది. విలన్ పాత్రకు ముందే గాలి తీసేశాక.. అతడి నుంచి హీరోకు సవాలే లేనపుడు వీళ్ల మధ్య ఇక ఎత్తులు పైఎత్తులు ఏం ఉంటాయి.. మజా ఏం ఉంటుంది? అక్కడి నుంచి ఫిల్లింగ్ కోసమని అనవసర ఎపిసోడ్లతో కాలయాపన చేస్తూ ప్రేక్షకుల్ని ఫ్రస్టేట్ చేయడం మొదలుపెట్టాడు అనిల్. ద్వితీయార్ధంలో కనీసం అరగంట సమయం వృథా ప్రయాసే. విలన్ చేసిన స్కామ్ ను బయటపెట్టే ఎపిసోడ్ విసిగిస్తుంది. విజయశాంతి అనుకున్న స్థాయిలో లేకపోయినా.. ఆమెతో మహేష్ కాంబినేషన్ సీన్లు.. మంచి ఎనర్జీతో సాగే మైండ్ బ్లాంక్ పాట ద్వితీయార్ధాన్ని కొంచెం నిలబెట్టాయి. లేకుంటే ‘సరిలేరు..’ తేలిపోయి ఉండేదే. విలన్ పాత్ర ముందే తేలిపోవడంతో క్లైమాక్స్ ను భారీగా తీయడం బాగోదనుకున్నట్లున్నాడు అనిల్. సరదాగా సినిమాను ముగిద్దామని ప్రయత్నించాడు కానీ.. అది కాస్తా సిల్లీగా తయారైంది. ఏదేమైనా ప్రథమార్ధంలో ఉన్నంత ఊపు రెండో అర్ధంలో లేకపోయింది. ఐతే రొటీన్ కథ.. బలహీన విలనీ.. ద్వితీయార్ధంలో సాగతీత ప్రతికూలతలే అయినప్పటికీ.. మహేష్ అభిమానులు.. మాస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే అంశాలైతే ‘సరిలేరు..’లో ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడేవాళ్లను ఈ సినిమా కచ్చితంగా మెప్పిస్తుంది.
నటీనటులు:
మహేష్ కెరీర్ మొత్తంలో అత్యంత ఉత్సాహభరితమైన పాత్రల్లో ‘సరిలేరు..’లోని అజయ్ క్యారెక్టర్ ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. మిగతా ప్రేక్షకులు కూడా మహేష్ ను ఇలాంటి పాత్రలో చూసి ఇష్టపడతారు. అంత ఎనర్జిటిగ్గా.. సరదాగా సాగుతుంది మహేష్ పాత్ర. ‘టేక్ ఎ బౌ..’ అనే సిగ్నేచర్ మేనరిజం చూపించినపుడు.. జయప్రకాష్ రెడ్డి దగ్గర ఆయన స్టయిల్ రాయలసీమ యాసలో మాట్లాడినపుడు మహేష్ కామెడీ టైమింగ్ చూడొచ్చు. చాన్నాళ్లుగా దాచి పెట్టేసిన తన డ్యాన్సింగ్ స్కిల్స్ తోనూ మహేష్ ఆశ్చర్యపరిచాడు. ‘మైండ్ బ్లాంక్’ పాటలో మహేష్ స్టెప్పులు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి. ఫైట్లలోనూ మహేష్ గ్రేస్ చూపించాడు. ఓవరాల్ గా మహేష్ తన అభిమానులకైతే కనువిందు చేసేశాడు. హీరోయిన్ రష్మిక మందన్నా పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఆమె ఉత్సాహంగానే నటించినా.. పాత్ర మరీ సిల్లీగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా మహేష్ ముందు ఆమె తేలిపోయింది. విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడానికి తగ్గ గొప్ప పాత్రేమీ కాదు కానీ.. ఆమె అందులో తన ప్రత్యేకత చాటుకుంది. సైనికుల గొప్పదనం గురించి చెప్పే సన్నివేశంలో విజయశాంతి నట కౌశలం కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గురించి చెప్పడానికేమీ లేదు. ఆరంభంలో బాగా అనిపించినా.. తర్వాత ఆ క్యారెక్టర్ తేలిపోయింది. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సత్యదేవ్, మురళీ శర్మ చాలా మామూలు పాత్రలు చేశారు. జయప్రకాష్ రెడ్డి.. అజయ్.. సంగీత పర్వాలేదు.
సాంకేతికవర్గం:
దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆడియోతో పోలిస్తే తెరమీద దృశ్యపరంగా పర్వాలేదనిపిస్తాయి. డాంగ్ డాంగ్.. మైండ్ బ్లాక్ పాటలు తెరపై బాగానే ఎంటర్టైన్ చేస్తాయి. సైనికుల మీద తీసిన పేట్రియాట్రిక్ సాంగ్ అన్నింట్లోకి బెస్ట్ అనొచ్చు. దేవి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొత్తగా ఏమీ ట్రై చేసినట్లు లేడు కానీ.. ఈ సినిమాకు తగ్గట్లుగా ఎనర్జిటిక్ స్కోర్ ఇచ్చి ఓకే అనిపించాడు. రత్నవేలు ఛాయాగ్రహణం బాగుంది. కశ్మీర్ ఎపిసోడ్లో.. కొండారెడ్డి బురుజు యాక్షన్ ఘట్టంలో ఆయన విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. దర్శకుడిగా అనిల్ రావిపూడి తన ప్రత్యేకతను చాటుకోలేదు కానీ.. మహేష్ ను అభిమానులు కోరుకునేలా చూపించడంలో మాత్రం విజయవంతం అయ్యాడు. కమర్షియల్ సినిమాల్లో కథ పెద్దగా ఉండదు కానీ.. ఇందులో కథ విషయంలో అతను మరీ లైట్ తీసుకున్నాడు. అతను ఎప్పట్లా కామెడీలో తన బలాన్ని చూపించలేకపోయాడు. ద్వితీయార్ధంలో అతను బాగా తడబడ్డాడు. సినిమాకు అవసరం లేని ఎపిసోడ్లతో సినిమాను ట్రాక్ తప్పించేశాడు. మహేష్ వన్ మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు కానీ.. లేకుంటే ‘సరిలేరు..’ తేలిపోయేదే.
చివరగా: సరిలేరు నీకెవ్వరు...బొమ్మ సగమే దద్దరిల్లింది
రేటింగ్-2.75/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre