తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం 'సర్కార్' దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాయి. తెలుగు వెర్షన్ తీసుకుంటే మొదటి నాలుగు రోజుల్లో దాదాపు రూ. 6 కోట్ల రూపాయల షేర్ సాధించింది. విజయ్ కి తెలుగులో ఉండే మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఇవి చాలా మంచి కలెక్షన్స్.
ఇప్పటివరకూ విజయ్ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం 'స్నేహితుడు'. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'స్నేహితుడు' ఫుల్ రన్ లో రూ. 6.5 కోట్లు సాధించింది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 7.5 కోట్లకు అమ్మారట. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కు మరో రూ.1.5 కోట్ల షేర్ మాత్రమే తీసుకురావాల్సి ఉంది. కాంపిటీషన్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం 'సర్కార్' కు కలిసి వచ్చే అంశమే. నవంబర్ 16 వరకూ కొత్త సినిమాలు లేవు పైగా ఆమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' కూడా తుస్సుమనడంతో థియేటర్లో సినిమాలు చూసే ప్రేక్షకులకు ఉన్న ఆప్షన్ 'సర్కార్' మాత్రమే.
మొదటి నాలుగు రోజుల్లో సర్కార్ సాధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. అన్నీ రూపాయలే.
నైజాం - 1.98 cr
సీడెడ్ - 1.34 cr(తెలుగు + తమిళం కలిపి)
ఉత్తరాంధ్ర - 0.48 cr
ఈస్ట్ - 0.43 cr
వెస్ట్ - 0.35 cr
కృష్ణ - 0.51 cr
గుంటూరు - 0.59 cr
నెల్లూరు - 0.23 cr
టోటల్ (ఏపీ + తెలంగాణా) - రూ. 5.91 cr