తమిళ స్టార్ హీరో విజయ్ తన సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉన్నాడు. ఈమద్య కాలంలో ఈయన నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా వంద కోట్ల క్లబ్ లో చేరుతూనే ఉన్నాయి. విజయ్ సినిమాలు సక్సెస్ అయినా కాకున్నా కూడా మినిమం 150 కోట్లు అంటూ ముద్ర పడిపోయింది. ‘కత్తి’ - ‘తుపాకి’ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో 150 కోట్లను సునాయాసంగా దక్కించుకున్నాయి. అయితే ఈయన గత చిత్రాలు ‘మెర్షల్’ - ‘తేరి’ చిత్రాలు జస్ట్ యావరేజ్ టాక్ ను దక్కించుకున్నాయి.
స్టార్ హీరోల సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే ఒక మోస్తరు వసూళ్లు వస్తాయి. కాని విజయ్ మూవీ యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా కోట్లు కురుస్తూనే ఉన్నాయి. ఏదో ఒక అంశం కలిసి రావడంతో విజయ్ సినిమాలు భారీగా వసూళ్లను దక్కించుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ‘సర్కార్’ చిత్రం విడుదలైన మొదటి రోజే పైరసీ అయ్యింది, దానికి తోడు అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ చిత్రంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ పలు ఏరియాల్లో సినిమా ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారు.
ఇన్ని అడ్డంకుల మద్య కూడా మొదటి నాలుగు రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అతి త్వరలోనే ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం ఉందని తమిళ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇలా వరుసగా 150 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న హీరోగా విజయ్ నిలిచాడు. రజినీకాంత్ సినిమాలను పక్కన పెడితే మరే హీరో కూడా విజయ్ రికార్డులను టచ్ చేయలేక పోతున్నారు. ప్రస్తుతం తమిళ నాట విజయ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అందుకు నిదర్శణమే ఈ కలెక్షన్స్ అంటూ తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు.