రెండు రోజుల సర్కార్ కలెక్షన్స్!

Update: 2018-11-08 08:53 GMT
తమిళ స్టార్ హీరో విజయ్ - ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'సర్కార్'.  రెండు రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందనే లభించింది. తెలుగు రాష్ట్రాల విషయం తీసుకుంటే రెండు రోజులకు గానూ 4.33 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ సాధించింది.

పోటీలో స్ట్రెయిట్ సినిమాలేవీ లేకపోవడం 'సర్కార్' కు బాగానే కలిసొచ్చింది.  పైగా మురుగదాస్ కు ఉన్న పాపులరిటీ కూడా సినిమాకు ఫేవర్ గా వర్క్ చేసింది.  ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 7 కోట్లకు పైగా మొత్తానికి అమ్మడం జరిగింది.  కాబట్టి ప్రస్తుతం ట్రెండ్ ని బట్టి చూస్తే డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసినట్టే.  వీకెండ్ ఎడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద కష్టమైన విషయమేమీ కాకపోవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సర్కార్ రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.  అన్ని ఫిగర్స్ రూపాయల్లోనే.

నైజాం - 1.40  cr

సీడెడ్ -  0.98 cr(తెలుగు + తమిళం కలిపి)

ఉత్తరాంధ్ర - 0.28 cr

ఈస్ట్  - 0.33 cr

వెస్ట్ - 0.31 cr

కృష్ణ - 0.39 cr

గుంటూరు - 0.49  cr

నెల్లూరు - 0.15 cr

టోటల్ - రూ.4.33  cr (ఏపీ + తెలంగాణా)

ఇదిలా ఉంటే తమిళ వెర్షన్ కు సంబంధించిన రెండో రోజు కలెక్షన్స్ వివరాలు అన్ని ఏరియలనుండి పూర్తిగా అందుబాటు లోకి రానందువల్ల మొదటి రోజు కలెక్షన్స్ వివరాలు మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాం.

తమిళ -తెలుగు వెర్షన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్

తమిళ నాడు - 20.02 cr

కర్ణాటక - 2.8 cr

కేరళ - 2. 7 cr

ఏపీ/తెలంగాణా - 2.3  cr

అమెరికా -1.49 cr

గల్ఫ్ కంట్రీస్ -  3.0 cr

మిగతా ఏరియాలు - 4.0 cr

వరల్డ్ వైడ్ టోటల్ (తెలుగు + తమిళం)- 36.31 cr(66.6 cr గ్రాస్)



Tags:    

Similar News