సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట'' సినిమా బాక్సాఫీస్ రికవరీ మొదలు పెట్టింది. గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ అందుకుంటూ.. మహేశ్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఆల్ టైం టైం రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు.
'సర్కారు వారి పాట' మేకర్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం.. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల వసూళ్ళు రాబట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన ప్రాంతీయ సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోనే 36.89 కోట్ల షేర్ రాబట్టి నాన్-RRR రికార్డ్ నమోదు చేసింది. అయితే రెండో రోజు శుక్రవారం నార్మల్ వర్కింగ్ డే అవ్వడంతో మార్నింగ్ - మ్యాట్నీ షోలకు డ్రాప్స్ కనిపించాయి. మళ్ళీ ఈవెనింగ్ - నౌట్ షోలకు మాత్రం జోరు చూపించింది.
ఈ నేపథ్యంలో SVP సినిమా రెండో రోజు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలు కలుపుకొని 11.64 కోట్ల షేర్ అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుని.. వర్కింగ్ డే నాడు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే సాలిడ్ గా ఉందనే అనుకోవాలి. 'సర్కారు వారి పాట' రెండో రోజు ఏరియా వైజ్ వసూళ్ళు క్రింది విధంగా ఉన్నాయి. మరి ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే నాటికి ఎలాంటి వసూళ్ళు రాబడుతుందో చూడాలి.
నైజాం - 5.2 కోట్లు
సీడెడ్ - 1.45 కోట్లు
యూఏ - 1.65 కోట్లు
ఈస్ట్ - 1.08 కోట్లు
వెస్ట్ - 45 లక్షలు
గుంటూరు - 51 లక్షలు
కృష్ణ - 89 లక్షలు
నెల్లూరు - 41 కోట్లు
మొత్తం - 11.64 కోట్లు
'సర్కారు వారి పాట' నిర్మాతల లెక్కల ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో 48.53 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక యూఎస్ఏలో మహేశ్ బాబు మూవీ భారీ వసూళ్లు సాధిస్తోంది. ప్రీమియర్స్ తో కలుపుకుని ఇప్పటి వరకు $1.5+ మిలియన్ కలెక్షన్స్ అందుకున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మహేష్ కెరీర్ లో యుఎస్ లో ఈ మార్క్ క్రాస్ చేసిన 8వ సినిమా ఇది.
కాగా, 'సర్కారు వారి పాట' సినిమాను ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు పరశురాం. ఇందులో మహేశ్ ను స్టైలిష్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో ప్రెజెంట్ చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించినగా.. సముద్రఖని - వెన్నెల కిషోర్ - నదియా - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.