సర్కారు వారి బిజినెస్‌ అక్కడ మొదలయ్యిందా?

Update: 2021-06-01 03:30 GMT
ఒకప్పుడు సినిమా మొత్తం పూర్తి అయిన తర్వాత బిజినెస్‌ జరిగేది. కాని ఇప్పుడు మాత్రం సినిమా సెట్స్ పై ఉండగానే బిజినెస్ అవుతోంది. ముఖ్యంగా కొన్ని సినిమాలు షూటింగ్ కూడా ప్రారంభించకుండానే బిజినెస్‌ అవుతున్నాయి. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఇటీవలే పూర్తి అయ్యాయి. పాన్ ఇండియా తో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదల కాబోతున్న ఆ సినిమా బిజినెస్ ను ముగించేశారు. విడుదలకు ఇంకా చాలా నెలల సమయం ఉంది. అయినా కూడా సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో బయ్యర్లు ఎగబడి ముందుకు వచ్చారు. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా బిజినెస్ చర్చలు జరుగుతున్నాయట.

మహేష్‌ బాబు సినిమా యావరేజ్ గా ఆడినా కూడా ఓవర్సీస్ లో మీడియం వసూళ్లు మిలియన్‌ డాలర్లు వసూళ్లు అవ్వడం ఖాయం. అందుకే మహేష్‌ బాబు ప్రతి సినిమాను కూడా ఓవర్సీస్‌ లో భారీ గా విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు. సర్కారు వారి పాట విషయంలో కూడా ఓవర్సీస్ బయ్యర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రముఖ ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ దాదాపుగా 15 కోట్ల వరకు కోట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా విడుదల సమయంకు క్రియేట్‌ అయిన బజ్‌ నేపథ్యంలో ఈమె మొత్తం మరింతగా పెరిగినా ఆశ్చర్యం లేదు.

ఓవర్సీస్‌ రైట్స్ విషయంలో సర్కారు వారి పాట నిర్మాతలు అతి త్వరలోనే డీల్ క్లోజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూల్‌ ను ముగించారు. తదుపరి షెడ్యూల్‌ ను ప్లాన్ చేసిన సమయంకే కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక మహేష్‌ బాబు కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ బిజినెస్‌ ను చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుండగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ బ్యానర్‌ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ లేదా టీజర్ ను మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News