ఫ్లాప్ డైరక్టర్ లేబుల్ తీసినందుకు హ్యాపీ

Update: 2017-01-24 00:39 GMT
చాలామంది ఎంతో ప్యాషన్ తో సినిమాలు తీస్తుంటారు. కాని బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిల్ అవుతుంటాయ్. వెంటనే సదరు దర్శకుడు ఇక పనికిరాడు అంటూ ఫిలిం ఇండస్ర్టీ అతన్ని డిస్కరేజ్ చేయడం మొదలెట్టేస్తుంది. అదిగో.. నువ్వు వస్తావని.. మా పెళ్ళికి రండి వంటి సినిమాలకు మాటలను రాసి.. తొట్టిగ్యాంగ్ వంటి సినిమాలతో భారీ హిట్లు కొట్టిన రైటర్ సతీష్‌ వేగేశ్నకూ ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకే మనోడు ఇప్పుడు ఎందుకు హ్యాపీగా చెబితే.. మనం ఆశ్చర్యపోవాలి.

ఈయన లేటెస్టుగా 'శతమానం భవతి' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. తొలిసారిగా 'దొంగల బండి' అంటూ నరేష్‌ తో ఒక సినిమా తీయగా.. అది ఫ్లాపైంది. అప్పటి నుండి సతీష్‌ వేగేశ్నను ఫ్లాప్ డైరక్టర్ అంటూ ఫిలిం ఇండస్ర్టీ మోసేసిందట. తరువాత హరీశ్‌ శంకర్ మనోడ్ని కలసి పనిచేద్దాం అంటూ మూడు సినిమాలకు మాటలు సీన్లు రాసే అవకాశం కల్పించడంతో.. దిల్ రాజుతో పరిచయమై.. శతమానం రూపొందించి.. ఇప్పుడు 25 కోట్ల హిట్టును సొంతం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అంటే.. ఆయన ఏమంటున్నాడో తెలుసా..

''ముందుగా నాకున్న ఫ్లాప్ డైరక్టర్ అనే ట్యాగ్ తీసేసి.. ఇక నన్ను కూడా హిట్టు డైరక్టర్ అంటారు. అందుకు నేను చాలా సంతోష పడుతున్నా. అలాగని ఈ సినిమా హిట్టును చూసి నాకు వెంటనే తదుపరి సినిమా ఇక్కడెవ్వరూ ఇచ్చేయరు. మళ్ళీ నేను మాంచి కతను రెడీ చేసి నెరేటి చేసి ఇంప్రెస్ చేశాకనే సినిమా వస్తుంది'' అంటూ తనదైన స్టయిల్లో వేగేశ్న తెలిపారు. చేదుగా అనిపించినా కూడా.. ఇదే ఇక్కడ జరుగుతున్న నిజం. 
Tags:    

Similar News