మెగా ఫ్యామిలీలో అభిమానుల మధ్య కుంపట్లు మరింత రాజుకుంటున్నాయి. అల్లు అర్జున్ కు - పవన్ కళ్యాణ్ అభిమానులకు మధ్య వివాదం కాస్త సద్దుమణిగిందని అనుకుంటుండగా.. ఈ మధ్య ‘తిక్క’ ఆడియోలో సాయిధరమ్ తేజ్ చేసిన ‘చెబుతాను బ్రదర్’ వ్యాఖ్యలు మళ్లీ నిప్పురాజేశాయి. బన్నీకి తేజు కౌంటర్ ఇవ్వడం అతడి అభిమానులకు నచ్చలేదు. ఇలాంటి టైంలో ‘తిక్క’ రిలీజవడం.. దానికి పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో వాళ్లకు మంచి ఛాన్స్ దొరికినట్లయింది. నిన్న ఫస్ట్ డే ఫస్ట్ షో అవడం ఆలస్యం.. సోషల్ మీడియాలో ‘తిక్క’ మీద సెటైర్లు మొదలయ్యాయి. ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి సాయిధరమ్ ను ఆడుకునే పనిలో పడ్డారు బన్నీ ఫ్యాన్స్.
ఇంతకుముందు బన్నీ తొలిసారి ‘చెప్పను బ్రదర్’ అన్నపుడు ఆ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ ‘చూస్కుంటాం బ్రదర్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టి బన్నీ మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత తేజు బన్నీకి కౌంటర్ గా వ్యాఖ్యలు చేసినపుడు ‘చెబుతాను బ్రదర్’ అన్న హ్యాష్ ట్యాగ్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ‘తిక్క కుదిరింది బ్రదర్’ అంటూ సాయిధరమ్ గాలి తీసే పనిలో పడ్డారు. బన్నీ అంత సుదీర్ఘంగా.. మంచిగా ఆ రోజు ఆ వివరణ ఇచ్చినా అభిమానుల్లో మార్పేమీ రాలేదంటే ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎవరేం మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. కొత్తగా వివాదం మొదలయ్యేలా ఏ వ్యాఖ్యలు చేయకుండా ఉండటం తప్ప మెగా ఫ్యామిలీ హీరోలు ఈ విషయంలో చేయగలిగేదేమీ లేదనే చెప్పాలి.