నిజ జీవితంలో ఏదైనా తప్పు చేసి.. కేసుల్లో ఇరుక్కుంటే.. ఆ సెలబ్రెటీల్ని సోషల్ మీడియా ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఈ విషయంలో ఎప్పుడూ టార్గెట్ గానే ఉంటుంటాడు. కొన్ని రోజుల కిందటే ‘టైగర్ జిందా హై’ ట్రైలర్ తో సల్మాన్ అభిమానుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఈ ట్రైలర్ ను రెండు కోట్ల మంది చూడటం విశేషం. ఈ ట్రైలర్ చూసి సల్మాన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారనే చెప్పాలి. అదే సమయంలో దీని మీద ట్రోలింగ్ కూడా పెద్ద స్థాయిలోనే నడుస్తోంది.
సల్మాన్ ఖాన్ మీద కృష్ణజింకల్ని చంపిన కేసుతో పాటు తాగి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైన కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘టైగర్ జిందా హై’ అనే టైటిల్ మీద ట్రోలింగ్ నడుస్తోంది. టైగర్ జిందా హై అంటే.. టైగర్ బతికే ఉన్నాడు అని అర్థం. ఐతే టైగర్ బతికే ఉన్నాడు కానీ.. ఈ టైగర్ దెబ్బకు పాపం కృష్ణజింకలే చచ్చిపోయాయి అంటూ జనాలు సెటైర్లు పేలుస్తున్నారు. సల్మాన్ ఈ ట్రైలర్ చివర్లో గన్ను పట్టుకుని ఉగ్రవాదుల్ని కాల్చిపారేసే సీన్ చూపిస్తారు. ఐతే సల్మాన్ కృష్ణజింకల్ని కాలుస్తున్నట్లుగా వీడియోలు తయారు చేసి ట్రోల్ చేస్తున్నారు. ఇలా అనేక రకాలుగా సల్మాన్ ను ఆడుకుంటోంది సోషల్ మీడియా.