శతమానం భవతి వంటి ఫ్యామిలీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీష్ వేగేశ్న తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. అయితే సమీర్ ను సోలో హీరోగా పరిచయం చేయకుండా ఒక మల్టీస్టారర్ చిత్రంతో సమీర్ ను పరిచయం చేయాలనే వినూత్నమైన ప్లాన్ ను సతీష్ వేగేశ్న చేస్తున్నాడట. ఇప్పటికే కథ సిద్దం అయ్యింది. మరో హీరో కోసం అన్వేషణ ప్రారంభం అయ్యింది. ఒక్కరు ఇద్దరు యంగ్ హీరోలను సంప్రదించాడు.
చివరకు ఆయన యువ హీరో సత్యదేవ్ ను సంప్రదించాడట. ఇటీవల 47 డేస్ మరియు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాల్లో కూడా ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అందుకే తన సినిమాలో ఆయన్ను మరో హీరోగా నటింపజేయాలనే నిర్ణయానికి సతీష్ వేగేశ్న సిద్దం అయ్యాడట. యువ హీరోలు సమీర్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు.
నటుడిగా పేరు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సత్యదేవ్ ఈ సినిమాకు తప్పకుండా ఒప్పుకుంటాడని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సతీష్ మూవీకి ఇంకా సత్యదేవ్ ఓకే చెప్పలేదట. త్వరలోనే ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ వస్తుందనే నమ్మకంతో సతీష్ వేగేశ్న ఉన్నాడట. సత్యదేవ్ ఓకే అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమాను పట్టాలెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.