ఆ గుజ‌రాతీ సినిమాకి ఫ్రీమేకా ఇది?

Update: 2019-12-30 17:30 GMT
ఫ్రీమేక్.. ప్రీమేక్ అంటూ రిలీజ‌వుతున్న ప్ర‌తి సినిమాకి మూలం ఎక్క‌డుందో క‌నిపెట్టేస్తున్నారు ట్యాలెంటెడ్ గ‌య్స్. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న అల వైకుంఠ‌పుర‌ములో ఫ‌లానా క్లాసిక్ సినిమా లైన్ తో తెర‌కెక్కించార‌ని ప్ర‌చారమైంది. ఎన్టీఆర్ న‌టించిన `ఇంటి గుట్టు` థీమ్ ఈ సినిమాకి స్ఫూర్తి అని... త్రివిక్ర‌మ్ త‌న‌దైన మార్క్ టెక్నికాలిటీస్ తో తెర‌కెక్కిస్తున్నార‌ని వైర‌ల్ గా ప్ర‌చార‌మైంది.

ఇక ఇదే సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న `ఎంత మంచివాడ‌వురా?` చిత్రానికి `ఆక్సిజ‌న్` అనే గుజ‌రాతీ చిత్రం స్ఫూర్తి అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 2018 మేలో రిలీజైన ఈ చిత్రం మాన‌వ సంబంధాలు ఎమోష‌న్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం. అందులో విధి ఆడే వింత నాట‌కం గురించి ఆస‌క్తిక‌ర ప్ర‌స్థావ‌న ఉంటుంది. ఈ సృష్టి దైవ‌సంక‌ల్పితం. మ‌నిషి జీవితం స్టేజీ డ్రామా లాంటిది. ఇందులో మ‌నుషులంతా ఆర్టిస్టులు. ఎవ‌రికి తోచిన‌ట్టు వారు ప్ర‌వ‌ర్తిస్తారు! అని న‌మ్మే పాత్ర ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ ఈ త‌ర‌హాలోనే ఆటాడించే కుర్రాడి క‌థ‌తోనే ఎంత మంచివాడవురా తెర‌కెక్కింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అందుకే ఆక్సిజ‌న్ (గుజ‌రాతీ) చిత్రానికి ఇది ఫ్రీమేక్ అన్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది. ఇక‌పోతే స‌తీష్ వేగేష్న తెర‌కెక్కించిన ఈ సినిమాలో ఎలాంటి క్లాసులు పీక‌డం లేద‌ట‌. గ‌తానుభ‌వాల దృష్ట్యా క‌ళ్యాణ్ రామ్ `ఎంత మంచివాడ‌వురా?` చిత్రాన్ని పూర్తి స్థాయి ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించారు. శ్రీ‌నివాస కల్యాణం విష‌యంలో జ‌రిగిన త‌ప్పుల్ని ఈసారి స‌తీష్ రిపీట్ చేయ‌డం లేద‌ట‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం జ‌న‌వ‌రి 15న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News