తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు గత శుక్రవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే అప్పటి నుంచి సత్యరాజ్ ఆరోగ్యం మీద అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి.
సత్యరాజ్ ఆరోగ్యం విషమంగా ఉందని.. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండడంతో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. సీనియర్ నటుడి ఆరోగ్యం గురించి ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడం ఈ రూమర్స్ మరింత ఎక్కువ అవడానికి ఊతం ఇచ్చింది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లే అని స్పష్టం అయింది.
సత్యారాజ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా నుంచి కోలుకోవడమే కాదు.. ఆదివారం రాత్రి హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ కూడా అయ్యారు. మరికొన్ని రోజులు హోమ్ ఐసొలేషన్ లో ఉండి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని తనయుడు శిబి సత్యారాజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
సిబి సత్యరాజ్ ఈరోజు ఉదయం ట్వీట్ చేస్తూ.. ''అప్పా నిన్న రాత్రి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తిరిగి వచ్చాడు.. ఆయన పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత పనిని పునఃప్రారంభిస్తాడు. మీ ప్రేమ మరియు మద్దతుకు అందరికీ ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు.
కాగా, 'బాహుబలి' సినిమాతో సినీ అభిమానుల్లో కట్టప్పగా గుర్తుండి పోయిన నటుడు సత్యరాజ్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని తెలిసి ఆందోళనలకు లోనయ్యారు. దీనికి తోడు ఆరోగ్యం విషమించిందంటూ చెన్నై మీడియా వర్గాల్లో కథనాలు రావడం వారిని కలవరపరిచింది. అయితే ఇప్పుడు పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ కట్టప్ప కోలుకున్నాడనే వార్త తెలియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. సత్యారాజ్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఆయన ప్రధాన పాత్రలు పోషించిన 'పక్కా కమర్షియల్' మరియు 'రాధే శ్యామ్' వంటి సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.