ఛార్మి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'జ్యోతిలక్ష్మి'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలున్నాయి. సెక్స్ వర్కర్ జ్యోతిలక్ష్మిగా ఛార్మి అభినయం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అలాగే ఈ చిత్రం ద్వారా పూరీ చెప్పదలుచుకున్న పాయింట్ అందరిలో హాట్ టాపిక్ అయ్యింది. వీటన్నిటినీ మించి ఈ చిత్రంలో నటించిన ఆ రింగుల జుత్తు కుర్రాడు ఎవరు? అన్న టాపిక్ వాడివేడిగా చర్చల్లోకొచ్చింది.
కుర్రాడు బావున్నాడు. ఛార్మికి బాగానే కోఆపరేట్ చేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా ఇలా వేశ్య వెంట పడ్డాడంటే మనసున్న మారాజే అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఏదేమైనా సత్యదేవ్‌పై అందరి ఎటెన్షన్ మళ్లింది. సమీక్షకులు సైతం ఈ కుర్రాడు బాగా నటించాడని ప్రశంసించారు.అయితే సత్యదేవ్ తదుపరి సినిమా ఏమిటి? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. అందగాడు, పెర్ఫామర్ కాబట్టి ఏ నటవారసత్వం లేకపోయినా పిలిచి అవకాశం ఇస్తారంటారా? లేక మళ్లీ రామ్‌గోపాల్ వర్మ అండ్ గ్యాంగ్‌తోనే సరిపెట్టుకోవాల్సొస్తుందా? కుర్రాడిలో విషయం ఉంది కాబట్టి ఎవరైనా పిలిచి అవకాశం ఇస్తారులే అని సరిపెట్టుకోలేం. ఎందుకంటే రోజులు మారిపోయాయ్. ట్యాలెంట్ ఒక్కటే ఇక్కడ నడిపించదు.
సత్యదేవ్ హీరోగా ఎదగాలంటే తనని తాను షైన్ చేసుకుని ఎప్పటికప్పుడు క్తొ ట్రాక్‌లో వెళితేనే సాధ్యం. కొత్త మార్గాల్ని అన్వేషించాలి. దర్శకనిర్మాతల్ని పట్టాలి. పట్టు పరిశ్రమలో అలా ఉంటేనే కొన్ని వర్కవుటవుతాయి. సత్య ఏం చేస్తాడో చూడాలి.