‘క్షణం’లో ఆ పాత్ర.. నాది కాదంటున్నాడు

Update: 2016-03-04 09:30 GMT
సినీ పరిశ్రమలో ఎవరి కెరీర్ ఎప్పుడు టర్న్ తీసుకుంటుందో చెప్పలేం. రవితేజ దాదాపు దశాబ్దం పాటు చిన్నా చితకా పాత్రలే వేశాడు. కానీ అనుకోకుండా బ్రేక్ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడతను పెద్ద మాస్ హీరో. ఇక కమెడియన్ పృథ్వీ కథ కూడా ఇంతే పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఈ మధ్యే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించాడు. కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ‘క్షణం’ సినిమాతో సత్యం రాజేష్ కెరీర్ కూడా ఇలాగే టర్న్ తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందులో రవి చౌదరి అనే పోలీస్ పాత్రలో అదరగొట్టేశాడు రాజేష్. కెరీర్లో ఇన్నేళ్లు సాధించని గుర్తింపు.. ఒక్క క్షణం సినిమాతో సంపాదించాడు రాజేష్.

ఈ ఆనందాన్ని విలేకరులతో పంచుకుంటూ కొన్ని ఆసక్తికర సంగతులు వెల్లడించాడు రాజేష్. ‘‘ఇప్పటివరకు 350 సినిమాల్లో నటించాను. ఎప్పుడూ ఇలాంటి పాత్రలో నటిస్తానని అనుకోలేదు. నేను సీరియస్ క్యారెక్టర్లో నటిస్తానని ఎవ్వరూ అనుకుని ఉండరు. ‘క్షణం' సినిమా ఆ అభిప్రాయాన్ని మార్చింది. నేను కూడా ఇలాంటి పాత్రలో నటించగలనని నమ్మకం కలిగించింది. ముందు ఈ సినిమా కోసం డెరైక్టర్ నన్ను కలిసినప్పుడు హీరో స్నేహితుడి పాత్రకు అడుగుతాడనుకున్నాను. కానీ పోలీస్ క్యారెక్టర్ చేయమనేసరికి ఆశ్చర్యపోయాను. నిజానికి నేను చేసిన పాత్రలో సంపత్ రాజ్ నటించాల్సింది. చివరి క్షణంలో నన్ను తీసుకున్నారు. అలా నా కెరీర్ మలుపు తిరిగింది. క్షణం సినిమా రిలీజైనప్పటి నుంచి వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. నేనిలాంటి పాత్రలో చేయడమేంటని ఆశ్చర్యపోతూ ఫోన్లు చేస్తున్నారు’’ అని రాజేష్ చెప్పాడు.
Tags:    

Similar News