బాలీవుడ్లో మీడియం రేంజి హీరోల్లో జాన్ అబ్రహాం ఒకడు. ఇటీవలే అతను ‘పర్మాణు’ అనే సినిమాలో నటించాడు. ఫోక్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన మూడు నెలల్లోపే మరో దేశభక్తి ప్రధాన చిత్రంతో పలకరించబోతున్నాడు జాన్. ఆగస్టు 15న అతడి కొత్త సినిమా ‘సత్యమేవ జయతే’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఆ చిత్ర ట్రైలర్ లాంచ్ అయింది.
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ‘సత్యమేవ జయతే’ ట్రైలర్ చూస్తే ఏ కొత్తదనం కనిపించడం లేదు. వేరే వాళ్ల అవినీతి కారణంగా ప్రాణం కోల్పోయిన ఒక సామాన్య పోలీస్. అతడి కొడుకు చిన్నతనం నుంచే అవినీతి వ్యవస్థపై పగ పెంచుకుంటాడు. పెద్దవాడయ్యాక రివెంజ్ మొదలుపెడతాడు. అవినీతిపరుడైన ప్రతి పోలీస్ అంతు చూస్తుంటాడు. చాలా కసిగా.. పకడ్బందీగా హత్యలు చేస్తుంటాడు. అతడిని పట్టుకోవడం వ్యవస్థకు సవాలుగా మారుతుంది.
ఆ స్థితిలో ఒక నిజాయితీ పరుడైన పోలీస్ రంగంలోకి దిగుతాడు. ఎవరు తప్పు చేసినప్పటికీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దన్నది ఆ పోలీస్ పాలసీ. అతను హీరో అంతు చూడటమే లక్ష్యంగా రంగంలోకి దిగుతాడు. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు మొదలవుతుంది. హీరోగా జాన్ నటిస్తే.. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్ అధికారిగా మనోజ్ బాజ్‌పేయి కనిపిస్తున్నాడు. ట్రైలర్ అంతా యాక్షన్ తో నింపేశారు. జాన్ ఎప్పట్లాగే కండలు తిరిగిన శరీరంతో.. ఇంటెన్స్ యాక్షన్ సీన్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా కనిపిస్తున్నాయి ట్రైలర్ చూస్తే. గుల్షన్ కుమార్ తో కలిసి టీ సిరీస్.. మరో సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి. మిలప్ మిలన్ జవేరి డైరెక్ట్ చేశాడు. మనోజ్ సరసన అమృత ఖన్విల్కర్ అనే కొత్తమ్మాయి ఈ చిత్రంలో నటించింది.
Full View