తరాలు మారినా.. కొత్త తరాలు ఎన్ని వచ్చినా తెలుగువారు మర్చిపోలేని కొన్ని పేర్లలో మహానటి సావిత్రి ఒకరు. డిజిటల్ ప్రపంచంలో ఆమె పేరును మర్చిపోతున్న వేళలో.. ఆమె బయోపిక్ గా వచ్చిన మహానటితో ఇప్పటి చిన్నారులకు సైతం సావిత్రి ఎవరో తెలిసిపోవటమే కాదు.. ఆమె నటించిన నాటి బ్లాక్ వైట్ సినిమాల్ని ట్యాబ్ ల్లో చూసి ఆమెకు వీరాభిమానులుగా మారిన వైనం తెలిసిందే.
సావిత్రికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వచ్చినట్లే.. మరెన్నో విషయాలు బయటకు రాలేదు. సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు మద్దాలి సుశీల. మీడియాలో రాని ఆమెకు సంబంధించిన వివరాలు తాజాగా ఆమె ద్వారా బయటకు వచ్చాయి.
ఒక ప్రముఖ పత్రిక సావిత్రి చిన్ననాటి స్నేహితురాల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. సావిత్రికి సంబంధించిన విషయాల్ని ఆమె మాటలు సరికొత్తగా బయటపెట్టాయి. వాటిలోని కొన్ని అంశాల్ని సుశీల మాటల్లో చూస్తే..
+ మా ఇద్దరికీ మొదటి పరిచయం విజయవాడలోనే. నేను ఆరేళ్ల వయసు నుంచీ ఓ గురువు వద్ద నృత్యం నేర్చుకునేదాన్ని. కొన్నిరోజులకు సావిత్రి చేరింది. తాను కాస్త ఆలస్యంగా చేరడంతో... మా గురువు తనకి బేసిక్స్ నేర్పించమన్నారు. అలా నేర్పించే క్రమంలో ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది.
+ సావిత్రి విజయవాడ మొగల్రాజపురంలోని వాళ్ల పెద్దనాన్న ఇంట్లో ఉండేది. మేం సత్యనారాయణపురంలో ఉండేవాళ్లం. అయితే ఇద్దరికీ మేం రిహార్సిల్ చేసే స్థలం దూరం. దాంతో సావిత్రి ‘నువ్వు మా ఇంటికి రా.. అక్కడ కాసేపు ఉండి రిహార్సిల్స్ కి వెళదాం. ఇంకో రోజు మీ ఇంట్లో సేద తీరి వెళదాం’ అని అనడంతో అలానే చేసేవాళ్లం. ఈ క్రమంలో ఇద్దరం సరదాగా ఉప్పు చేపా పప్పు చారు... అనుకుంటూ నడిచేవాళ్లం. మా ఇళ్లల్లో రిక్షా ఎక్కమని డబ్బులు ఇస్తే వాటితో కొబ్బరి లౌజు కొనుక్కుందాం అనేది. లేదంటే దానం చేసేది.
+ అప్పటికి ఇద్దరికీ పది పదకొండేళ్లు ఉంటాయి. గుంటూరు జిల్లా మానుకొండ అనే ఊళ్లో ప్రదర్శనకు వెళ్లాం. . రాధా కృష్ణ వేషం కట్టాం. అయితే అక్కడకు మమ్మల్ని చూడ్డానికి వచ్చిన పిల్లలు... మాలో రాధ ఎవరూ, కృష్ణ ఎవరూ అని మా ముందే చర్చించుకుంటున్నారు. వాళ్లలో ఒకమ్మాయి..‘అదిగో తెల్లగా ఉంది రాధ.. నల్లగా ఉంది కృష్ణుడు’ అనేసింది. దాంతో సావిత్రి కూర్చీలోంచి లేచి దాన్ని కొట్టి అక్కడ్నుంచీ వెళ్లిపోయింది. ఎందుకంటే తనకి నలుపు అనేసరికి కోపం వచ్చింది. నాతో ఎందుకు మాట్లాడవు అని అడిగితే ‘నీ పక్కన ఉంటే నేనింకా నల్లగా కనిపిస్తున్నా. అందుకే నీతో ఉండను’ అని వెళ్లిపోయింది. సాయంత్రం మళ్లీ ప్రోగ్రాం సమయానికి వచ్చి...‘దేవుడు ఇచ్చిన నలుపు. మనమేం చేస్తామే... నాకు ఇప్పుడు కోపం తగ్గింది. రా నా దగ్గరున్న జామ కాయ తిందాం’అంటూ కాకి ఎంగిలి చేసి పెట్టింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను.
+ తను ఎలా ఉన్నా నచ్చుతుంది. ఎందుకంటే తనది దానగుణం - స్నేహ గుణం. పెద్ద స్టార్ హీరోయిన్ అయినా నన్ను చివరి వరకూ గుర్తుపెట్టుకుంది. మద్రాస్ వెళ్లాక నన్నూ సినిమాల్లో పరిచయం చేస్తానని పిలిపించింది. అప్పటికే నాకు ఇద్దరు ఆడపిల్లలు. సావిత్రి రమ్మనందుకు అక్కడికి వెళ్లా. అప్పటికే అది వాళ్లింటికి చక్రపాణి, నాగిరెడ్డి వంటి పెద్దపెద్ద వారిని పిలిపించింది. వాళ్లూ నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. కానీ పిల్లలకీ, ఆయనకీ దూరంగా ఉండటం ఇష్టం లేక నేను వద్దనుకుని విజయవాడలోనే ఉండిపోయా. అయినా నేనూ నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. హరికథలూ.. చెప్పేదాన్ని.
+ ఉత్తరాలు రాసుకునేవాళ్లం. దాని చేతి రాత చాలా బాగుంటుంది. ఎప్పుడు విజయవాడ వచ్చినా నన్ను కలిసేది. కొన్నాళ్లకి తను చాలా బిజీ అయింది. పీఏలూ, మేనేజర్లు ఆ ఉత్తరాలు తనకి చేరనిచ్చేవారు కాదు. క్రమంగా ఉత్తరాలు తగ్గాయి. ఏలూరులో విజయ స్పిన్నింగ్ మిల్లు పెట్టడంతో మళ్లీ దగ్గరయ్యాం. కష్టసుఖాలు నాతో చెప్పుకునేది. నిజాయితీగా మాట్లాడేది.
+ నాకు సావిత్రి మీద కోపమెప్పుడూ రాలేదు. కానీ..నా మీదే దానికి పీకల్లోతు కోపం వచ్చింది. తాను ఇప్పించిన సినిమా ఆఫరును నేను వద్దన్నప్పుడు. ఆ విషయం నాకు తాను చనిపోవడానికి ఆరునెలల ముందు చెప్పింది. ఓ పనిమీద విజయవాడ వచ్చింది. అప్పుడు ‘నువ్వు సినిమాల్లోకి రాలేదని అప్పట్లో బాగా కోపం వచ్చింది. ఇప్పుడు నువ్వు రానందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కుటుంబంతో చక్కగా ఉన్నావు. నాకు అలా లేదు. నువ్వు వద్దని చెప్పినా నేను ఆ పెళ్లి చేసుకున్నా. ఏ మాత్రం సంతోషంగా లేను. ఇప్పుడు నా భర్త నాతో లేడు. ఏనాడూ నాకు నచ్చిన చీర కట్టుకోలేదు. ఇష్టమైనవీ తినలేదు. సంపదా, సంతోషం నన్ను వదిలి వెళ్లిపోయాయి...’ అని ఏడ్చింది.