ఒకవేళ నాగ అశ్విన్ కనక మహానటి సినిమా తీయకపోయి ఉంటే సావిత్రి గురించి ఇంత చర్చ రీసెర్చ్ ఎప్పుడూ జరిగేది కాదేమో. దానికి తోడు సినిమా ఘన విజయం సాధించడమే కాక తమిళ్ లో సైతం మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. జెమినీ గణేషన్ కూతుళ్ళ నుంచి కొంత అభ్యంతరం వ్యక్తం అవుతున్నప్పటికీ అదేమంత సీరియస్ మేటర్ కాకపోవడంతో అందరు లైట్ తీసుకున్నారు. ఇక సావిత్రి గారితో పాటు జెమినీ గణేషన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేరున్న నిన్నటి తరం నటుడు రాజేష్ మహానటి తమిళ వెర్షన్ నడిగైర్ తిలగం చూసి తన మనసులో మాటలు ఒక మీడియా ఛానల్ తో పంచుకున్నారు. సావిత్రి గారు జెమినీ గణేషన్ ప్రేమలో పడటం ఒక తప్పైతే పిల్లలున్నారు అని తెలిసి కూడా రెండో పెళ్ళికి సిద్ధపడటం అంత కన్నా తప్పని తేల్చి చెప్పారు.
జెమినీ గణేషన్ మందు అలవాటు చేసినప్పటి దానికి బానిస కావడం మాత్రం పూర్తిగా సావిత్రి గారిదే బాధ్యత అన్న రాజేష్ తనకూ ఆ అలవాటు ఉందని కానీ జీవితాన్ని నాశనం చేసుకునేంత కాదని క్లారిటీ ఇచ్చారు. సావిత్రి గారి వ్యక్తిత్వానికి జెమిని గణేషన్ గారి మనస్తత్వానికి పొత్తు కుదరదని తెలుసని అయినా ఇద్దరు పెళ్లి చేసుకోవడం చివరికి సావిత్రికి అశాంతినే మిగిలించిందని చెప్పుకొచ్చారు. జెమిని గణేషన్ సన్నిహిత మిత్రుడు ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే.ఇదిలా ఉంచితే మహానటి జోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముప్పై కోట్ల షేర్ దాటేసి లాభాల్లోకి అడుగు పెట్టిన మహానటి రేపు వచ్చే కొత్త సినిమాల విడుదల వల్ల కొంత ప్రభావం చెందినా వాటికి వచ్చే టాక్ ని బట్టి అది ఎంత మోతాదులో ఉంటుంది అనేది చెప్పొచ్చు.