మన దేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రిలో ప్రతి ఏడాది సుమారుగా ఒక 200 సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అందులో అందరికీ తెలిసిన సినిమాలు ఒక 50 మాత్రమే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రేక్షకులు చూసిన తెలిసిన సినిమాలు సంఖ్య పెరుగుతూ పెరుగుతూ మూడు అంకెల సంఖ్యగా మారింది. ఒకప్పుడు ప్రేక్షకుడు పోస్టర్ పై స్టార్ బొమ్మను చూసి థియేటర్ కు వచ్చేవాడు. ఇప్పుడు కథ బాగాలేకపోతే అక్కడ సూపర్ స్టార్లు ఉన్న కూడా చూడటంలేదు. ఒక్కప్పుడు చిన్న సినిమాలు ప్రేక్షకులు చూడకపోవడానికి ప్రధాన కారణం అందులో పరిణితి లేని నటన - తక్కువ స్థాయి ప్రొడక్షన్ ప్రమాణాలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచన తీరు పూర్తిగా మారింది. కథ బాగుంటే వాళ్ళకు అది బాగా నచ్చితే ఆ సినిమా ఎవరు తీశారు ఎవరు నటించారు వారు కొత్త వారా లేక పేరున్న వారా అనేవి ఏవి ఆలోచించకుండా థియేటర్ కు వెళ్ళి సినిమా చూస్తున్నారు.
ఉదాహరణకు ఈ ఏడాదిలో విడుదలైన కొన్ని సినిమాలను చూస్తే మీకే అర్ధవుతుంది. శతమానం భవతి - గురు - ఘాజీ - కేశవ లాంటి సినిమాలలో చెప్పుకోవడానికి పెద్ద స్టార్లు ఎవరు లేరు కానీ కథ అద్భుతంగా ఉండటంతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. గురు లాంటి సినిమాలో విక్టరీ వెంకటేష్ ఉన్నా ఆ సినిమా కథా బలం వలనే ఆడింది. ఈ మధ్య విడుదలైన శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాలో కూడా భారీ స్టార్స్ ఎవరు లేరు. కథ సరిగ్గా కుదరడంతో అన్నింటా మంచి కలెక్షన్లు రాబట్టింది. అలానే మరో చిన్న సినిమా స్టార్ డైరెక్టర్ కృష్ణ వంశీ నక్షత్రం ఘోర పరాజయం పొందింది. కథనం పూర్తిగా అసందర్భంగా ఉండటం చేతనే ఈ సినిమాను ప్రేక్షకులు తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు. మెగా స్టార్ 150 వ చిత్రం ఖైదీ 150 లాంటి కథలు పక్కన పెడదాం ఎందుకంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం కథ కన్నా మెగాస్టార్ మళ్ళీ తిరిగిరావడం అనే కాన్సెప్ట్ బాగా వర్క్ ఔట్ అయ్యింది. పిచ్చ క్రేజ్ ఉన్న స్టార్లు నటించిన సినిమాలను కూడా ప్రేక్షకులు తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు పవర్ స్టార్ ‘కాటమరాయుడు’ - సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ భారీ అంచనాల మధ్య విడుదలై తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ప్రేక్షకులు కొన్నేళ్ళ ముందువరకు స్టార్లను చూసి వెళ్ళేవారు ఇప్పుడు కథ బాగుంటుందని అనిపిస్తేనే థియేటర్ కు వెళ్తున్నారు. సోషల్ మీడియా బాగా పాపులర్ కావడంతో కొంతమంది చిన్న దర్శకులు కూడా వాళ్ళ కథను షూట్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఎందులో చూస్తున్నాం అనే దానికన్నా ఏమి చూస్తున్నాం అనేదాని పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. మన పక్క ఇండస్ట్రి తమిళనాడులో చిన్న సినిమాకు మంచి కథకు ముందునుంచే ప్రేక్షకారాధన ఉంటూ వచ్చింది. మన తెలుగులో ఇప్పుడుప్పుడే అది మొదలైంది. అలాగే ఇప్పుడు విడుదలైన ఆనందో బ్రహ్మ అనే చిన్న సినిమా కూడా కథలో ఉండే వైవిద్యం వలనే కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మరో సినిమా అర్జున్ రెడ్డిలో కూడా స్టార్లు ఎవరు లేకపోయినా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఆ సినిమా పై మంచి అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు. సో ఫైనల్ గా చెప్పొచ్చేదేంటంటే.. కథే రాజు కథే మంత్రి.. ప్రేక్షకులే న్యాయనిర్ణేతలు!!!