దేవిశ్రీతో సీక్రెట్ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్?

Update: 2022-09-05 04:31 GMT
గాలిని మూట కట్టిన చందంగా.. సెలబ్రిటీలకు సంబంధించి ఒక్కోసారి బయటకు వచ్చే ప్రచారాలకు.. నిజానికి ఏ మాత్రం లింకు లేని విధంగా ఉంటుంది. అలాంటిదే ఒకటి తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా చెప్పే దేవిశ్రీ ప్రసాద్ కు రహస్యంగా పెళ్లైపోయిందని.. పెళ్లి కుమార్తె మరెవరో కాదు అంటూ చేస్తున్న ప్రచారం అంతా ఇంతా కాదు.

ఇంతకీ దేవిశ్రీతో సీక్రెట్ గా పెళ్లైందన్న వాదనలతో వార్తల్లోకి వచ్చిన ఆ నటి పేరు పూజిత పొన్నాడ. తెలుగు తెర గ్రీక్ వీరుడు నాగార్జున.. కార్తీలు కలిసి నటించిన ఊపిరి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.

అచ్చ తెలుగు అమ్మాయిగా పేరున్న పూజిత.. రంగస్థలం.. హ్యాపీ వెడ్డింగ్.. ఓదెల రైల్వే స్టేషన్ లాంటి సినిమాల్లో నటించినా.. పెద్దగా బ్రేక్ రాలేని పరిస్థితి.

ఆమె నటించిన 'ఆకాశ వీధుల్లో' అనే సినిమా విడులకు సిద్ధమైంది. విశాఖపట్నానికి చెందిన ఆమె.. త్వరలోనే దేవిశ్రీతో పెళ్లి జరుగుతుందన్న ప్రచారం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.అయితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పూజిత.. తనకు దేవిశ్రీతో సీక్రెట్ గా పెళ్లైందన్న ప్రచారంపై విస్మయాన్ని వ్యక్తం చేస్తూ.. తనకు అలాంటి రిలేషన్లు ఏమీ లేవని స్పష్టం చేశారు.

ఈ తరహా పుకార్లు ఎలా బయటకు వస్తాయో తనకు తెలీటం లేదని ఆమె వివరించింది. అంతేకాదు.. తాను ఎవరితోనూ రిలేషన్ లో లేదని తేల్చిన పూజిత.. తాను సింగిల్ గా ఉన్నానని.. ఎవరితోనూ రిలేషన్ లో లేనని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News