కాసులు కుంభవృష్టి కురిపించినోడే సినిమా మగాడు అని చెప్పకనే చెప్పాడు నాని. 3 కోట్ల ఖర్చుతో 30 కోట్లు కురిపించడం ఎలానో చూపించాడు. అందుకే అతడికి బిగ్ బాస్ నుంచి పొగడ్తలే పొగడ్తలు. కేవలం పొగడ్తలే కాదండోయ్ .. ఏకంగా పార్టీలే పార్టీలు. టాలీవుడ్ ని తన కనుసన్నల్లో ఉంచుకుని శాసించే శాసన కర్త అయిన అల్లు అరవింద్ ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయడం టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చకొచ్చింది.
సక్సెస్ మీట్ పేరుతో బిబిఎం చిత్రయూనిట్ కి అదిరిపోయే పార్టీ ఇచ్చారాయన. అయితే ఈ ప్రయివేటు పార్టీ జరిగినట్టు చీమక్కూడా తెలీదు. నాని కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ సినిమా కమర్శియల్ గా బ్లాక్ బస్టర్ హిట్. బిబిఎం దేశవిదేశాల్లో, తెలుగు రాష్ర్టాల్లో భారీ వసూళ్లతో కలెక్షన్ ల ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల గ్రాస్..19 కోట్ల రూపాయల నెట్ వసూల్ చేసింది. దీంతో చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్ - బన్నీ - వాసు లు తెగ ఖుషీ అయిపోయారు. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన అసాధారణ వసూళ్లను సాధించినందుకు ఓ ట్రీట్ పడాలనుకున్నారు. అందుకే అరవింద్ అతిధి గృహంలో ఘనమైన పార్టీ ఏర్పాటు చేశారు.
పార్టీలో నిర్మాతలు మారుతిని పోగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా అరవింద్ టీమ్ అందరికీ స్సెషల్ ట్రీట్ కూడా ఇచ్చారు.. ఆ సందర్భంలో అరవింద్ ఇదే టీమ్ తో బాలీవుడ్ లో బిబిఎం బాలీవుడ్ రీమేక్ గురించి ప్రస్థావించారని చెబుతున్నారు. అంటే ఇక మారుతి బాలీవుడ్ లోనూ అడుగుపెట్టబోతున్నాడన్నమాట!