భాషలకు అతీతంగా అందరి నోట నానిన తమిళ మూవీ మెర్సల్. మోడీకి వ్యతిరేకంగా.. జీఎస్టీకి పంచ్ లు వేస్తూ డైలాగులు ఉన్నాయన్న పేరుతో మెర్సల్ మూవీ వార్తల్లో కనిపించినంత బాగా ఇటీవల కాలంలో మరే సినిమా ప్రచారం పొందలేదు. బోలెడన్ని వివాదాల తర్వాత విడుదలైన ఈ సినిమా.. తమిళంలో బాహుబలి 2 తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా గొప్పలు చెప్పారు.
విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించినట్లుగా చెప్పారు. ఈ మధ్యనే తెలుగులో అదిరింది పేరుతో విడుదల చేశారు. అయితే.. భారీ కలెక్షన్లు సాధించినట్లు చెబుతూ.. మొత్తంగా రూ.250 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లుగా ప్రచారం జరిగిన ఈ మూవీతో భారీ లాస్ అని చెబుతున్నారు ప్రముఖ నటుడు కమ్ బీజేపీ నేత ఎస్వీ శేఖర్.
మెర్సెల్ నిర్మాతలకు రూ.60 కోట్ల నష్టం వచ్చేలా చేసిందని చెబుతున్న ఆయన.. సినిమాకు సంబంధించిన ఇన్ సైడ్ ముచ్చట్లు చెప్పుకొచ్చారు. చిత్ర హీరో భారీ పారితోషికాన్ని తీసుకున్నారని.. దర్శకుడు ఆట్లీ ఈ సినిమాకు రూ.13 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని.. ఆయన తన గత సినిమాకు కేవలం రూ.3 కోట్లు మాత్రమే తీసుకున్నారన్నారు. ఎక్కడైనా రూ.3కోట్ల పారితోషికం తీసుకునే దర్శకుడు తన తర్వాతి సినిమాకు రూ.13 కోట్లు తీసుకోవటం చూశారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇలా బడ్జెట్ కు సంబంధించిన చిక్కుల కారణంగా సినిమా కలెక్షన్లు సాధించినా భారీ నష్టాన్ని మూటగట్టుకుందని.. నిర్మాతలకు భారీ లాస్ ను మిగిల్చినట్లుగా వెల్లడించారు. ఎక్కడైనా సినిమా నష్టం వస్తే నిర్మాతలు చెప్పుకుంటారు. కానీ.. మెర్సల్ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని చెప్పిన తర్వాత.. ఇంత భారీ నష్టం వచ్చిందని చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది.