ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన రాజు గారి గది2 ప్రస్తుతం మిక్సీడ్ టాక్ తో నడుస్తోంది. చాలావరకు సినిమాలో అనుకున్నంతగా కామెడీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. హర్రర్ సన్నివేశాలు కూడా నార్మల్ గానే ఉన్నాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా వరకు చిత్ర యూనిట్ కొంత నిరాశతోనే ఉందని తెలుస్తోంది. అయినా కూడా ప్రమోషన్స్ ని ఏ మాత్రం తగ్గించడం లేదు.
ముఖ్యంగా నాగార్జున అయితే ఆయన గత సినిమాలకంటే ఈ సినిమాకు కొంచెం ఎక్కువగానే ప్రమోషన్స్ చేశారనే చెప్పాలి. అక్కినేని సమంత కూడా పెళ్లి అయిన కొన్ని రోజులకే ప్రమోషన్స్ చేయడానికి చిత్ర యూనిట్ తో కలిసింది. అయితే సినిమాకు మరింత హైప్ తేవాలని చిత్ర యూనిట్ రీసెంట్ గా మరొక దారిని ఎంచుకుంది. ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షించడానికి సినిమాలోని హాట్ బ్యూటీ సీరత్ కపూర్ ద్వారా కూడా సినిమాకు హైప్ తేవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
రీసెంట్ గా ఒక హాట్ ఫోటోని సీరత్ రిలీజ్ చేసింది. ఇందులో సీరత్ చాలా సెక్సీ గా కనిపిస్తోందని కొందరు అంటుండగా.. అమ్మడు బ్లాక్ అండ్ పింక్ అలాగే ఎల్లో కాంబినేషన్ అదిరిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. సినిమాలో గ్లామర్ షోతో బాగానే ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇలా హాట్ స్టిల్స్ తో మళ్లీ మరికొంత మంది ప్రేక్షకులను టార్గెట్ చేసింది. చూడాలి మరి సీరత్ అందాలు ఎంతవరకు ఉపయోగపడతయో.. ఈ సోకుల వలలో ఎంతమంది ఆడియన్స్ పడతారో.