బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా హీరోగా తెరకెక్కించిన సినిమా ''రాధే''. 'యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ చిత్రం కోసం తెలుగు పాట 'సీటీమార్' ని రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ ని కంపోజ్ చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. సల్మాన్ కోరిక మేరకు హిందీలో రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. మే 13న ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో 'సీటీమార్' సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ మిలియన్ల వ్యూస్ తో పాటుగా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ పాట రైట్స్ విషయంలో దేవిశ్రీకి మ్యూజిక్ కంపెనీ వారికి ఏదో సమస్య వచ్చిందని.. ఈ సమస్యను 'డీజే' నిర్మాత దిల్ రాజు దగ్గర పంచాయతీ పెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.
'సీటీమార్' తెలుగు సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ వారు అప్లోడ్ చేయగా.. ఇప్పుడు 'రాధే' చిత్రంలోని హిందీ వర్షన్ ని జీ మ్యూజిక్ ఛానల్ నిన్న రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదిత్య మ్యూజిక్ లేబుల్ వారిని కాదని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను 'రాధే' టీమ్ కి ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే వాస్తవంగా ఆదిత్య మ్యూజిక్ వారి అంగీకారంతోనే దేవిశ్రీ 'రాధే' టీమ్ కి 'సీటిమార్' సాంగ్ ని ఇచ్చాడని తెలుస్తోంది. ఇందులో ఎలాంటి కాంట్రవర్శీలు గానీ వివాదం కానీ లేవని.. అసలు ఈ మ్యాటర్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు లేనే లేడని సమాచారం. దీంతో 'రాధే' కోసం డీఎస్పీ ఇచ్చిన సాంగ్ వివాదం పై క్లారిటీ వచ్చినట్లైంది.