కమ్ముల తెలంగాణ లవ్ స్టోరీ అంటా

Update: 2017-12-14 12:30 GMT
టాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలను చేస్తు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫిదా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా తన మార్కెట్ పరిధిని కూడా ఇంకాస్త పెంచుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమాను చేస్తాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నెక్స్ట్ కూడా కమ్ముల మరొక లవ్ స్టోరీతోనే వస్తాడట. కొన్ని రోజుల క్రితం లీడర్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని చాలా రూమర్స్ వచ్చాయి. 

రానాతో చర్చలు జరిపినట్టుగా టాక్ కూడా వచ్చింది. కానీ ఆవి అబద్ధాలని తేలింది. ఎందుకంటే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల అర్జున్ రెడ్డి హీరోతో వర్క్ చేయడానికి రెడీ అయ్యాడట. విజయ్ దేవరకొండ ని రీసెంట్ గా కలిసి తెలంగాణ లవ్ స్టోరీ కాన్సెప్ట్ ని చెప్పి మెప్పించాడని తెలుస్తోంది. విజయ్ ని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా ఈ దర్శకుడు వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ తో ఒక సినిమాను చేస్తే బావుంటుందని రెడీ అయ్యాడట. 

నిర్మాత దిల్ రాజు ఈ స్పెషల్ లవ్ స్టోరీని నిర్మించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా విజయ్ తో ఒక సినిమాను చేయాలనీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా శేఖర్ కమ్ములనే కథ రెడీ చేయడంతో ఫిదా సక్సెస్ ని రిపీట్ చెయ్యాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం విజయ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే మరో రెండు సినిమాల షూటింగ్ లతో కూడా విజయ్ పాల్గొంటున్నాడు. మరి శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ ను ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.
Tags:    

Similar News