అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నిజానికి ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, ఆ వెంటనే లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్. హే పిల్ల.. అనే సాంగ్ విడుదల చేసి ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. మొదటి నుండి కూడా ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి సమాచారం సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్యను కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న సాయి పల్లవి లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్‌ని బట్టి చూస్తే..
ఈ మూవీలో నాగ చైతన్య- సాయి పల్లవిల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తుంది. వారి కాంబినేషన్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే 'లవ్ స్టోరీ'కి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి సేల్ అయ్యాయట. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో మొదలుపెట్టాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట. కేవలం 15% షూటింగ్ మిగిలి ఉందని అంటున్నారు. ఇక ఈ షూటింగ్ కూడా రామోజీ ఫిలింసిటీలో ఫినిష్ చేసే ఆలోచన చేస్తున్నాడట శేఖర్ కమ్ముల. ఇప్పటికే అల్లు అరవింద్ సినిమా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. మరి నిజంగా ఆగష్టులో ఈ సినిమా పట్టాలెక్కనుందా లేదా అనేది కొంతకాలం ఆగితే గాని తెలిసేలా లేదు.