అల్లరి అల్లరి కలిసినంత.. ఆమని ఆమని మురిసినంత.. అందం అందం వికసించినంత... ఈ దోస్తీ మనసు దోస్తోంది. ఏ ఇద్దరు మగువలు ఎదురెదురు పడినా ఆ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే నానుడి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ నారీమణులిద్దరూ కలిసిపోయారు. ఒకరితో ఒకరు స్నేహం చేశారు. కలిసి పార్టీలకెళతారు. కలిసి షాపింగులు చేస్తారు. కలిసి లంచ్ లు - డిన్నర్ లు లాగించేస్తుంటారు. పెళ్లికి పోవాలాన్నా, పిక్నిక్ కి వెళ్లాలన్నా.. ఇంకేం చేయాలన్నా కలిసే చేస్తారు. అసలింతకీ ఎవరండీ బాబూ ఆ ఇద్దరూ అనే సందేహం వస్తే అక్కడికే వస్తున్నాం.
ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల ముద్దుల హీరోలు అల్లరి నరేష్ - నానీ.. సతీమణులు. ఒకరు విరూప. మరొకరు అంజన ఎలవర్తి. విరూప అల్లరి నరేష్ సహధర్మ చారిణి - అంజన నానీకి భార్యామణి. ఈ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. నరేష్ - నానీ లానే బాగా క్లోజ్. ఏం చేసినా కలిసే చేస్తుంటారు. అల్లరి పనులు - చిలిపి పనులు - షాపింగు పనులు.. ఏవైనా కలిసే. ఇదిగో ఓ సారి ఇద్దరూ కలివిడిగా ఉన్నప్పుడు ఇలా సెల్ఫీ దిగి ఆన్ లైన్ లో ప్రచారానికి పెట్టారు. అంతా బాగానే ఉందమ్మో! టాలీవుడ్ లో ఏ సెలబ్రిటీ భార్యను కదిల్చినా.. ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ చెప్పుకుంటారు. అలాంటి అలవాట్లు వీళ్లకు కూడా ఉండే ఉంటాయ్. శ్రీనువైట్ల భార్య రూపా వైట్లలా - రాజమౌళి భార్య రమా రాజమౌళిలా పెద్ద లెవల్ కి టాలీవుడ్ లో ఎదిగేయాలని ఆశిద్దాం.