‘మగధీర’.. ‘రోబో’.. ‘ఈగ’.. ‘బాహుబలి’ లాంటి సినిమాలతో ఇప్పుడు దక్షిణాది సినిమాలో భారీతనం ఎంతో పెరిగింది. టెక్నాలజీని గొప్పగా వాడుకుంటూ భారీ బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. కానీ ఇంత బడ్జెట్.. ఇంత టెక్నాలజీ లేనపుడే.. పరిమితమైన వనరుల్లో ‘యుగానికి ఒక్కడు’ అనే సెన్సేషనల్ మూవీ తీశాడు తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్. కార్తి అప్పటికి స్టార్ కాదు. ఒక్క సినిమాలో మాత్రమే నటించిన అతడిని పెట్టి సాహసోపేత సినిమా తీశాతను. ఏ అంచనాలు లేకుండా ‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసిన జనాలు షాకయ్యారు. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి భలేగా థ్రిల్ చేశాడతను. ఐతే ఇంకొంచెం బడ్జెట్ ఉండి.. ఒక పెద్ద హీరోను పెట్టి.. ఇంకొంచెం మెరుగ్గా సినిమా తీసి బాగా ప్రమోట్ చేసి ఉంటే ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అప్పట్లో.
అయినప్పటికీ ఉన్నంతలో ‘యుగానికి ఒక్కడు’ బాగానే ఆడింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట సెల్వ రాఘవన్. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. ‘‘నేను బయటకు ఎక్కడికి వెళ్లినా ధనుష్‌తో నేను తీసిన ‘పుదుపేట్టై’కి సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కిస్తారు.. అని అందరూ ఆసక్తిగా అడుగుతున్నారు. కానీ నా మనసులో వినిపిస్తున్న చప్పుడు మాత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ తెరకెక్కించాలన్నదే. చోళుల అద్వితీయమైన ప్రయాణాన్ని తెరకెక్కించాలన్నదే ఆశ నాలో ఎప్పటినుంచో తీరని దాహంగా ఉంది’’ అని సెల్వ ట్విట్టర్లో వెల్లడించాడు. సెల్వ చేసింది తక్కువ సినిమాలే కానీ.. వాటిలో చాలా వరకు క్లాసిక్స్ అనిపించుకున్నాయి. ‘కాదల్ కొండేన్’.. ‘7/జి బృందావన కాలనీ’.. ‘పుదుపేట్టై’.. ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’.. ‘యుగానికి ఒక్కడు’.. ఇలా అతడి నుంచి ప్రత్యేకమైన సినిమాలే వచ్చాయి. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ విషయంలో సెల్వ ఇంతగా ఆలోచిస్తున్నాడంటే భవిష్యత్తులో ఆ సినిమా తప్పకుండా వస్తుందన్నమాటే.