డైరెక్షన్ నాది కాదంటే వినరే..

Update: 2015-10-14 15:30 GMT
తమిళంలో సెల్వ రాఘవన్.. తెలుగులో శ్రీ రాఘవ.. ఎక్కడ ఏ పేరు పెట్టుకున్నా అతడు వేసిన ముద్ర మాత్రం అలాంటిలాంటిది కాదు. 7/జి బృందావన కాలనీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పిచ్చోళ్లను చేసేశాడు రాఘవ. ఆ తర్వాత ‘ఆడువారి మాటలకు అర్థాలే వేరులే’ కూడా మన ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ‘వర్ణ’ మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ సినిమా తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సెల్వరాఘవన్.. ప్రస్తుతం శింబుతో ‘కాన్’ అనే సినిమా తీస్తున్నాడు.

ఐతే ఈ సినిమా తీయడానికి ముందు గ్యాప్ లో సెల్వ రాఘవన్ ఓ సినిమా డైరెక్ట్ చేశాడంటోంది తమిళ మీడియా. కానీ అతను మాత్రం నేనా సినిమా డైరెక్ట్ తీయలేదు మొర్రో అని మొత్తుకుంటున్నాడు. ఆ సినిమా మరేదో కాదు.. ‘మాలై నేరత్తు మైకం’. ఈ సినిమాతోనే దర్శకురాలిగా పరిచయమవుతోంది సెల్వరాఘవన్ భార్య గీతాంజలి. నిజానికి ఇది సెల్వ రాఘవన్ తీయాలనుకున్న సినిమా. 7/జి.. కి సీక్వెల్ టైపు మూవీ ఇది.

ఐతే తనకు కుదరక గీతాంజలితో డైరెక్షన్ చేయించానని అన్నాడు సెల్వ రాఘవన్. కానీ సినిమా టీజర్, విజువల్స్ చూస్తుంటే సెల్వనే డైరెక్టర్ అన్న ఫీలింగ్ కలుగుతోంది. పైగా ఇందులో హీరోయిన్ గా నటించిన వామిఖ.. తన షూటింగ్ అనుభవాల గురించి మాట్లాడుతూ సెల్వ రాఘవన్ తనను తిట్టడం.. ఏడవడం గురించి చెప్పింది. దీంతో తమిళ మీడియా అంతా.. సెల్వనే డైరెక్ట్ చేసి తన భార్యను ప్రమోట్ చేయడం కోసం ఆమెకు డైరెక్టర్ గా క్రెడిట్ ఇచ్చారని అంటోంది. ఐతే సెల్వ మాత్రం తాను స్క్రిప్టు మాత్రమే రాశానని.. డైరెక్షనంతా తన భార్యే చూసుకుందని.. ఆమెకు క్రెడిట్ ఇవ్వాలని అంటున్నాడు.  ఐతే సినిమా చూస్తే కానీ.. నిజంగా ఎవరు డైరెక్టర్ అన్నది చెప్పలేం.
Tags:    

Similar News