ఆ కమెడియన్ బంపర్ ఆఫర్ పట్టాడు

Update: 2016-07-15 12:20 GMT
హీరోగా కమెడియన్లు నిలదొక్కుకుందే లేదు.. వీడేం నిలబడతాడు అంటూ తమిళ కమెడియన్ సంతానం ను చాలామంది కామెడీ చేశారు. అయితే వరుసగా ఇతగాడు హీరోగా చేసిన సినిమాలు కూడా ఫ్లాపవ్వడంతో.. నిజంగానే కమెడియన్లు హీరోలుగా సెట్టవ్వడం కాస్త కష్టమే అనిపించింది. కాని మనోడు మాత్రం తన ప్రయత్నాలను ఆపట్లేదు.

ఈ మధ్యనే రిలీజైన దిలుక్కు దుడ్డు కూడా ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడం సంతానం సీన్ ఈజ్ ఓవర్ అన్నారు పెద్దలు. మనోడు ఈలోపు సర్వర్ సుందరం అనే సినిమా షూటింగుతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సంతానంకు మరో సూపర్ ఆఫర్ వచ్చింది. ఈ సినిమాను తీయబోయే దర్శకుడు ఎవరో కాదు. 7/జి బృందావన్ కాలనీ.. ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే.. మైకం ఎన్న.. వంటి సినిమాలను తీసిన విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్‌ ఉన్నాడు చూడండి.. మనోడు ఇప్పుడు సంతానంను హీరోగా పెట్టి.. ఐటి కంపెనీల్లో జరిగే భాగోతాలను ఒక కామెడీ సినిమాగా తీస్తున్నాడట.

ఇంతకంటే పెద్ద సినిమా ఏం కావాలి అంటున్నారు సంతానం అభిమానులు. ఒక ప్రక్కన ధనుష్‌ ను ఒక స్టార్‌ గా చేసింది అన్నయ్య సెల్వరాఘవన్‌ సినిమాలే అని వేరే చెప్పక్కర్లేదుగా. అందుకే ఇప్పుడు సంతానం కూడా టాప్ మోస్ట్ హీరో అవ్వడానికి ఈ సినిమా ఉపయోగపడే ఛాన్సుందంటున్నారు.
Tags:    

Similar News