య‌ముడి గా కైకాల సాహ‌సాలివి!

Update: 2022-12-23 07:30 GMT
న‌వ‌ర‌స న‌ట సార్వ‌భౌమ కైకాల ఖ్యాతి గురించి చెప్పేదేముంది.  పౌరాణిక‌...జాన‌ప‌ద‌..సాంఘీక  చిత్రాల్లో న‌టించిన ఓ దిగ్గ‌జం. కొన్నిర‌కాల పాత్రలు  కైకాల కోస‌మే పుట్టాయ్ అన్నంత‌గా ఆ పాత్ర‌ల‌కు జీవి పోసిన న‌టుడాయ‌న‌. భ‌య‌పెట్టే విల‌నిజం నుంచి క‌రుణ ర‌సం...హాస్యం వ‌ర‌కూ  ప్ర‌తీ పాత్ర‌లోనూ త‌న‌దైన ముద్ర వేసారు.  ఇక వెండి తెర‌పై 'య‌ముడు' పాత్ర‌ల‌కు పెట్టింది పేరు ఆయ‌న‌.

య‌ముడు వేషం వేయాల్సి వ‌స్తే ద‌ర్శ‌కుల ఆప్ష‌న్ కైకాల మాత్ర‌మే.   అంత‌గా ఆ పాత్ర ప్ర‌భావం ఆయ‌న‌పై ఉంది. య‌ముడు అంటే య‌మ‌లోకంలో  ఇలాగే ఉంటాడా? అన్నంత ప్ర‌భావాన్ని చూపించారు. 'య‌ముండ' అంటూ ఆయ‌న గొంతు స‌వ‌రిస్తే! అక్క‌డ ద‌ద్ద‌రిల్లాల్సిందే. అలాంటి య‌ముడు పాత్ర‌ల్ని ఓసారి త‌లిస్తే...

1977 లో రిలీజ్ అయిన 'య‌మ‌గోల' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో సీనియ‌ర్ రామారావు పాత్ర‌కు ఎంత పేరొచ్చిందో....య‌ముడు పాత్ర పోషించిన కైకాల‌కు అంత‌టి పేరు ద‌క్కింది. అలాగే 1998 లో 'యుముడికి  మొగుడు' సినిమాలోనూ య‌ముడు పాత్ర‌లో ఒదిగిపోయారు. ఆయుషు తీర‌కుండానే య‌మ‌లోకానికి వెళ్లిన చిరంజీవి పాత్ర‌- య‌ముడు పాత్ర మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ణణ తెర‌పై ఎంతో అద్భుతంగా పండింది.

అలాగే 'య‌మ‌లీల' చిత్రంలో కైకాల అదే పాత్ర‌తో మ‌ళ్లీ ఆక‌ట్టుకున్నారు. అలీ హీరోగా న‌టించిన ఈ  సినిమా అప్ప‌ట్లో మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ న‌మ్మ‌కంతోనే 'య‌మ‌గోల‌ మ‌ళ్లీ మొద‌లైంది' అంటూ మ‌రో సినిమా చేసారు. ఇందులోనూ కైకాల మ‌రోసారి య‌ముడు పాత్ర‌లో మెప్పించారు. అలాగే చివ‌రిగా మాస్ రాజా ర‌వితేజ హీరోగా న‌టించిన 'ద‌రువు' చిత్రంలో కూడా య‌ముడి పాత్ర‌లో కైకాల ఆక‌ట్టుకున్నారు.

ఇలా కైకాల ఎప్పుడు య‌ముడు ఆహార్యంలో కి దూరిపోయినా! ప‌క్కాగా స‌రితూగే వారు. ఆర‌కంగా   ఆ పాత్ర పండాల్సిందే అన్నంత‌గా ముద్ర వేసారు. య‌ముడి ఆహార్యంలో  ఒదిగిపోవాడినికి  ఆయ‌న‌లో ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు చాలానే ఉన్నాయి. ఒడ్డు ..పొడ‌వు...గాత్రం ప్ర‌తీది కైకాల‌ని ఆ పాత్ర వైపు తీసుకెళ్లింద‌ని అత‌నితో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు చాలా సంద‌ర్భాల్లో చెప్పారు.

ఆ ఒక్క పాత్ర‌తోనే   ఆయ‌న‌కు ఎంతో  గౌర‌వం..గుర్తింపు ద‌క్కింది. దేశంలో  ఏ న‌టుడు య‌ముడి పాత్ర‌కి సరిపోడ‌ని..కైకాల మాత్ర‌మే  ఆ పాత్ర‌కి ప‌రిపూర్ణంగా న్యాయం చేస్తార‌ని  అనేవారు. య‌ముడి పాత్ర‌లో ఎన్నిసార్లు క‌నిపించినా ఆయ‌నెప్పుడు ప్రెష్ గానే  క‌నిపిస్తార‌ని అంటుంటారు. అలాంటి పాత్ర‌   మ‌ళ్లీ పుట్టాలి అంటే ఆయ‌నే మ‌ళ్లీ దిగి రావాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News