80వ దశకం ప్రారంభంలో నటుడిగా కెరీర్ ప్రారంభించిన హీరోల్లో భాను చందర్ ది ప్రత్యేక శైలి. ఒక విధంగా చెప్పాలంటే కరాటే నేపథ్యం వున్న హీరోల్లో సుమన్ తరువాత ఈయన పేరే ప్రముఖంగా వినిపించేది. యాక్షన్ చిత్రాలకు అప్పట్లో సుమన్ - భాను చందర్ కెరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఆడవాళ్లు మీకు జోహార్లు.. సత్యం శివం, నిరీక్షణ, తరంగిణి, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, స్వాతి, లాయర్ సుహాసిని, సూత్రధారులు, సిందూరం వంటి తదితర చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకోవడమే కాకుండా హీరోగా, డైరెక్టర్‌గా, గిటారిస్ట్ గా, సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు భాను చందర్.
విశ్వక్ సేన్ నటించిన హిట్ : ద ఫస్ట్ కేస్ కు సీక్వెల్ గా అడివి శేష్ హీరో గా హీరో నాని నిర్మిస్తున్న తాజా చిత్రం `హిట్ : ద సెకండ్ కేస్` లో నటిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఇదిలా వుంటే ఓ ప్రముఖ ఎంటర్‌టైన్ మెంట్ ఛానల్ కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిన సీనియర్ హీరో భాను చందర్ ఇదే సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాజమౌళి తో `సింహాద్రి` చిత్రానికి వర్క్ చేశాను. ఆ సమయంలోనే తనకు ఓ మాట చెప్పాను. డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆయనని పిలిచి ఈ సినిమా తరువాత మీకు నేను ఫోన్ చేస్తా కానీ మీరు అందుబాటులో వుండరు. సినిమా పెద్ద హిట్ అవుతుంది. దేశం గర్వించదగ్గ దర్శకుడు అవుతారని చెప్పాను. ఇప్పడు అదే జరిగింది. రాజమౌళి గురించి చెప్పాలంటే సినిమా తీయడమే కాదు.. దాన్ని ప్రచారం చేయడం, హిట్ చేయడం ఎలానో చాలా మంది ఆయనని చూసి నేర్చుకోవాలి.
మట్టిని చాక్లెట్ పేపర్ లో పెట్టి దాన్ని వండర్ ఫుల్ చాక్లెట్ అని అమ్మగలడు. ఇలా ఎంత మంది చేయగలరు. అందుకు నైపుణ్యం కావాలి. ఎవరుపడితే వాళ్లు ఇలా చేయలేరు. ప్రత్యేక నైపుణ్యం అందుకు కావాలి. అది రాజమౌళిలో వుంది` అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రజనీకాంత్, ప్రదీప్ శక్తి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో మొదటి బ్యాచ్ అని చెప్పిన ఆయన మెగాస్టార్ చిరంజీవిది చివరి బ్యాచ్ అని తను నా కంటే చిన్నవాడని చెప్పేశాడు.
అంతే కాకుండా `మన వూరి పాండవులు` షూటింగ్ సమయంలో వర్షం పడిందని షూటింగ్ ఆపేశారు. ఆ సమయంలో చిరు, నేను కరాటే ప్రాక్టీస్ చేసేవాళ్లం అంటూ ఆనాటి రోజుల్ని గుర్తిచేసుకున్నారు. ఇక తనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే సుహాసిని అని టక్కున చెప్పేశారు. ప్రస్తుత సినిమాల గురించి మాట్లాడుతూ `ది కశ్మీర్ ఫైల్స్` గొప్ప సినిమా అని అది ఆస్కార్ కి వెళుతుందని, అలాంటి ఒక్క సినిమా తీసి చనిపోయినా చాలని చెప్పుకొచ్చారు భానుచందర్.