సౌత్ సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందుతోంది నయనతార. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చూపిస్తూనే ఉంది నయన్. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని స్టార్ట్ హీరోలందరి సరసన నటించిన నయన్.. సినిమాలో క్యారెక్టర్ ఏదైనా అవలీలగా యాక్ట్ చేసే అతికొద్ది హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. అందుకే ఆమెకు ఇప్పటికి ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం నయనతార 'నేత్రికాన్' 'మూకుతి అమ్మన్' 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 'అన్నాత్తే' సినిమాలో కూడా నటించనుంది. మాస్ చిత్రాల డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అన్నాత్తే' లో ఖుష్బూ - మీనా - కీర్తి సురేశ్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా నిలిపివేశారు.
కాగా ఇంతకముందు రజినీ సరసన 'చంద్రముఖి' 'దర్బార్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నయన్ 'శివాజీ' 'కథానాయకుడు' చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించింది. ఇప్పుడు 'అన్నాత్తే' రజినీ - నయన్ కలయికలో రానున్న ఐదవ సినిమా అవుతుంది. ఈ విధంగా చూసుకుంటే సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఇన్ని సినిమాలు చేసిన ఈ జనరేషన్ హీరోయిన్స్ లో ఏకైన హీరోయిన్ నయనతార అని చెప్పవచ్చు. వీటితో పాటు మరి కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. మొత్తం మీద 2003లో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన నయనతార ఇప్పటికీ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. నయన్ ధాటికి కుర్ర హీరోయిన్లు సైతం వెనకబడిపోతున్నారు. అయితే తెలుగులో మాత్రం అమ్మడు అప్పుడప్పుడే కనిపిస్తోంది. గతేడాది మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటించిన నయనతార డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది.