'సై' సినిమా నుంచి రాజమౌళితో కలిసి ప్రయాణం చేస్తున్న కెమెరామెన్ సెంథిల్. మగధీర, ఈగలాంటి ప్రెస్టీజియస్ మూవీస్‌కి కూడా సెంథిలే పనిచేశాడు. అయితే ఆయనకి దర్శకుడు కావాలనే కోరిక ఉందట. ఎప్పుడెప్పుడు మెగాఫోన్ పడదామా అని ఎదురు చూస్తున్నాడట. అయితే నేను దర్శకుడిని కాకుండా రాజమౌళినే అడ్డుకుంటున్నాడని తాజాగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు సెంథిల్.
ఆ ఇంటర్వ్యూలో సెంథిల్ మాట్లాడుతూ... ''దర్శకత్వం చేయాలనేది నా కల. అయితే రాజమౌళి ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలు చెబుతుండటంతో దర్శకుడు కావాలన్న నా ఆలోచనని విరమించుకొంటున్నా. రాజమౌళి ఇంత మంచి కథ చెప్పాడు కదా... ఇదొక్క సినిమా పూర్తి చేశాక దర్శకత్వం చేద్దాం అనుకొంటుంటా. అలా నా దర్శకత్వపు కల వాయిదా పడుతూ వస్తోంది. బాహుబలి2 అయ్యాక మాత్రం కచ్చితంగా నా దర్శకత్వంలో సినిమా వస్తుంది'' అని తెలిపాడు. బాహుబలి ప్రయాణం నా జీవితాంతం గుర్తుండిపోతుందని సెంథిల్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకోసం పడిన కష్టం ప్రత్యేకమైనదని ఆయన వివరించారు. భారీ సెట్టింగులతో పాటు, ఆయా పాత్రల భావోద్వేగాల్ని కేప్చర్ చేయడం ఓ సవాల్‌గా భావించి పనిచేశానని సెంథిల్ చెప్పాడు.