ఎంత స్మార్ట్ గా కష్టపడ్డారో!!

Update: 2017-03-31 04:15 GMT
బాహుబలి సిరీస్ కోసం ఎంతో స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించారనే విషయంలో సందేహం లేదు. అయితే.. తొలి భాగం విడుదల సమయంలో.. కేవలం అంత వరకే తప్ప షూటింగ్ సంగతులు ఒక్కటంటే ఒక్కటి కూడా  బయట పెట్టలేదు రాజమౌళి అండ్ టీం.

కానీ ఇప్పుడు రిలీజ్ కానున్న బాహుబలి ది కంక్లూజన్.. ఈ సిరీస్ లో చివరది. అందుకే తమ కష్టాలను.. అనుభవాలను అన్నిటినీ మూవీ ప్రచారం కోసం ఉపయోగించేసుకుంటున్నారు. బాహుబలి కోసం మొత్తంగా తమ యూనిట్ ఐదేళ్లు కష్టపడగా.. ఇందులో షూటింగ్ కోసమే మూడేళ్లు వెచ్చించామని చెప్పారు. అయితే.. తొలి భాగం విషయంలో షూటింగ్ పార్ట్ చాలా ఎక్కువగా చేశారట. అందుకే ఎక్కువ ఖర్చు.. బోలెడంత సమయం.. శారీరక శ్రమ పెరిగిపోయాయని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ చెబుతున్నాడు. దాన్నుంచి నేర్చుకున్న అనుభవాలతో రెండో భాగం కోసం కష్టాలను స్మార్ట్ అధిగమించే ప్రయత్నం చేశామని చెబుతున్నారు.

రెండో భాగం విషయానికి వచ్చేసరికి ముందుగా యుద్ధ సన్నివేశాలను ప్రీ విజువలైజ్ చేసి.. ఫైటర్లతో షూట్ చేశారట. ఎంత ఫుటేజ్ అవసరం అనే విషయంలో ముందుగానే క్లారిటీ వచ్చేసిందట. ఆ తర్వాత యాక్టర్లతో షూటింగ్ చేయడంతో.. బాహుబలి2 కోసం సమయం.. డబ్బు.. శక్తియుక్తులు అన్నీ ఆదా అయ్యాయని చెబుతోంది బాహుబలి టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News