'మైనా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది తమిళ నటి అమలా పాల్. విక్రమ్ నటించిన `నాన్న` మూవీతో మరింతగా పేరుతెచ్చుకుంది. తెలుగులోనూ స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుని ఇక్కడ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ ని వివాహం చేసుకుని మధ్యలోనే విడిపోయిన అమలా పాల్ నిత్యం తన సినిమాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది.
అయితే తాజాగా లైంగిక వేధిపుల కారణంగా ఈసారి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ భవ్నీందర్ సింగ్ దత్ పై విల్లుపురం పోలీసులని హీరోయిన్ అమలాపాల్ ఆశ్రయించింది. తనని బిజినెస్ లోనూ చీటింగ్ చేశాడని, అంతే కాకుండా తనకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలని, వీడియోలని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
దీంతో అమలా పాల్ కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు భవ్నీందర్ సింగ్ దత్ పై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో 11 మంది కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారట. 2018లో భవ్నీందర్ సింగ్ దత్, అమలా పాల్ కలిసి ఓ ప్రొడక్షన్ కంపనీని స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారిందట. ఆ మధ్య పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటే ప్రత్యేకంగా ఫొటో షూట్ ని కూడా చేశారు.
దానికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అంతా అమలా పాల్ పెళ్లి వార్తలపై చర్చించుకున్నారు. అప్పట్లోనే వీరి పెళ్లి వార్త, లిప్ లాక్ ఫొటో షూట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ తరువాత నిర్మాణ సంస్థ కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయట. అప్పటి నుంచి అమలా పాల్ భవ్నీందర్ సింగ్ దత్ కు దూరంగా వుంటూ వస్తోంది. ఇదిలా వుంటే అమలకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోగా భవ్నీందర్ సింగ్ దత్ .. అమలా పాల్ తనతో ప్రేమలో వున్న సమయంలో తీయించుకున్న ప్రైవేట్ ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ అమలాపాల్ ని బెదిరించడం మొదలు పెట్టాడట.
దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అమలా పాల్ తాజాగా పోలీసులని ఆశ్రయించి భవ్నీందర్ సింగ్ దత్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనితో పాటు మరో 11 మందిపై కేసు ఫైల్ చేశారు. భవ్నీందర్ సింగ్ దత్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం మరో 11 మంది కోసం గాలిస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.