కింగ్ ఖాన్ ని 1000 కోట్ల క్ల‌బ్ లో చేర్చే మూవీ ఏది?

Update: 2022-05-24 02:30 GMT
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమా విడుద‌లై ఇప్ప‌టికే నాలుగేళ్లు పూర్తయింది. ఆయన్ను మళ్లీ వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షారుఖ్ ఖాన్ త్వరలో అదిరిపోయే బ్యాంగ్ తో తిరిగి రేస్ లోకి రావాల‌ని గ‌ట్టి పంతంతో ఉన్నాడు. 2022- 2023లో విడుదలయ్యే 9 సినిమాల్లో అత‌డు కనిపించ‌నుండ‌డం ఆస‌క్తిక‌రం.

ప్ర‌స్తుతం స్పై థ్రిల్లర్ అయిన పఠాన్ పైనే ఖాన్ గురి పెట్టాడు. ఇందులో  జాన్ అబ్రహం - దీపికా పదుకొణెలతో స్క్రీన్ స్పేస్ ని షేర్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండ‌గా.. భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా అల‌రించ‌నుంది. ఈ చిత్రం 2023 జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.

త‌దుప‌రి సౌత్ ఫిల్మ్ మేకర్ అట్లీతో కలిసి సీరియ‌స్ గా ఓ ప్రాజెక్ట్ (టైటిల్ ఫిక్స్ కాలేదు) పై ప‌ని చేస్తున్నాడు. ఇందులో అత‌డు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార SRK స‌ర‌స‌న న‌టిస్తుండ‌డంతో సౌత్ లో ఇది త‌న‌కు పెద్ద ప్ల‌స్ కానుంది.  ఈ చిత్రంతో న‌య‌న్ బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. ఇక షారూక్ కి ఇది పాన్ ఇండియా కేట‌గిరీ సినిమా కావ‌డంతో త‌న దృష్టి అంతా దీనిపైనే పెట్టాడు.

త‌న ఫేవ‌రెట్ రాజ్ కుమార్ హిరాణీతో షారూక్ భారీ ప్ర‌యోగం చేస్తున్నాడు. ఇమ్మిగ్రేషన్ ఆధారిత సామాజిక హాస్య చిత్రం లో త‌దుప‌రి న‌టించాల్సి ఉంది. షారుఖ్ ఖాన్ - తాప్సీ పన్ను ఇందులో నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. ఈ చిత్రం 2023 డిసెంబర్ 22న విడుదల కానుంది.

కింగ్ ఖాన్ త‌న స్నేహితులైన అమీర్ ఖాన్ .. స‌ల్మాన్ ఖాన్ చిత్రాల్లో అతిథి పాత్ర‌ల‌తో అద‌ర‌గొట్ట‌నున్నాడు. ఈ సినిమాలు ఈ ఏడాది విడుద‌ల‌తో అద‌ర‌గొట్ట‌బోతున్నాయి. అమీర్ ఖాన్- కరీనా కపూర్ నటించిన చిత్రం లాల్ సింగ్ చ‌ద్దా ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అలియా భట్- రణబీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన అధికారిక లీక్ లు ఏవీ ఇవ్వ‌లేదు.

టైగర్ 3 కోసం షారుఖ్ ఖాన్ -సల్మాన్ ఖాన్ మళ్లీ కలిసి ప‌ని చేసారు. ఈ సినిమాలో షారూక్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. స‌ల్మాన్ భాయ్ తో స్నేహాన్ని కొన‌సాగిస్తూ షారూక్ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు.

R మాధవన్ నటించిన చిత్రంలో షారూక్ అతిథి పాత్ర‌ధారిగా న‌టించారు. భారతీయ శాస్త్రవేత్త .. ఏరోస్పేస్ ఇంజనీర్ S. నంబి నారాయణన్ బ‌యోపిక్ ఇది.  ద్రవ ఇంధన రాకెట్ సాంకేతికతను పరిచయం చేయడంలో సుప్ర‌సిద్ధుడైన నంబియార్ జీవిత‌చ‌రిత్ర‌ను తెర‌పై ఉత్కంఠ‌భ‌రితంగా ఆవిష్క‌రిస్తున్నారు. తాజా క‌థ‌నాల ప్రకారం, .. ఈ చిత్రంలో షారూఖ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.

ఆప‌రేష‌న్ కుక్రీ అనే దేశ‌భ‌క్తి చిత్రంలోనూ షారూక్ న‌టిస్తున్నారు. ఇది భారత సైన్యం - వైమానిక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ కుక్రీ మిషన్ ఆధారంగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న‌ వార్ డ్రామా. వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంది.

కరణ్ జోహార్ పేరు పెట్టని ప్రాజెక్ట్ లోనూ అత‌డు న‌టిస్తున్నాడు. యాక్షన్ రొమాన్స్ చిత్రంలో ఖాన్ పాత్ర అదిరిపోనుందిట‌. అతనితో పాటు ప్రియాంక చోప్రా జతకట్టనుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇవ‌న్నీ ఈ రెండేళ్ల‌లోనే ఖాన్ అభిమానులకు ట్రీటివ్వ‌నున్నాయి. నాలుగేళ్ల పాటు త‌మ ఫేవ‌రెట్ నుంచి సినిమాల్లేక అల్లాడిన వారికి ఇప్పుడు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆస‌క్తిక‌రంగా వీట‌న్నిటి న‌డుమా కింగ్ ఖాన్ షారూక్ తాను న‌టించిన ప‌ఠాన్ ని అట్లీతో సినిమాని హిరాణీతో సినిమాని సంచ‌ల‌న విజ‌యాలుగా మ‌ల‌చాల్సి ఉంటుంది. అంతేకాదు సౌత్ తో పోటీప‌డి 1000 కోట్ల క్ల‌బ్ హీరోగా స‌త్తా చాటాల్సి ఉంటుంది.
Tags:    

Similar News