అవునా.. షారుఖ్ సినిమా రిలీజా?

Update: 2017-08-04 04:50 GMT
బాలీవుడ్ సినిమాలు ఆడాలంటే.. అందులో సెక్స్ అయినా ఉండాలి.. లేదా షారుఖ్ అయినా ఉండాలి.. అంటూ ఒక జోక్ ఉండేది ఒకప్పుడు. దీన్ని బట్టి హిందీ సినిమాల్లో షారుఖ్ కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అతడికి ‘కింగ్ ఖాన్’ అని.. ‘బాలీవుడ్ బాద్ షా’ అనే పేర్లు ఊరికే వచ్చేయలేదు. ఒకప్పుడు అంత జోరు మీద ఉండేవాడతను. ఖాన్ త్రయంలో మిగతా ఇద్దరికి.. షారుఖ్ కు చాలా అంతరం ఉండేది. షారుఖ్ కు ఉన్నంత మార్కెట్ వీళ్లకుండేది కాదు. అతడి సినిమా విడుదలవుతుంటే ఎంత హంగామా ఉండేదో ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో షారుఖ్ బాగా వెనుకబడిపోయాడు. మరోవైపు అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. అతణ్ని దాటేసి చాలా ముందుకు వెళ్లిపోయారు.

ఈ ఏడాది ఆరంభంలో షారుఖ్ మూవీ ‘రయీస్’కు మంచి హైపే వచ్చింది. కానీ టాక్ మాత్రం అందుకు తగ్గట్లుగా లేదు. సినిమా ఫ్లాపైంది. ఆ ప్రభావం షారుఖ్ కొత్త సినిమా ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ మీద పడింది. ఎప్పుడూ మాస్ డైరెక్టర్లతో సినిమాలు చేసే షారుఖ్ ఈ సారి.. క్లాస్ సినిమాలకు పెట్టింది పేరైన ఇంతియాజ్ అలీకి కమిట్మెంట్ ఇచ్చాడు. అలీ సినిమాలకు క్రిటికల్ అక్లైమ్ అయితే వస్తుంది కానీ.. వసూళ్లు ఉండవు. దీనికి తోడు షారుఖ్ మార్కెట్ కూడా దెబ్బ తినడంతో ‘జబ్ హ్యారీ..’ సినిమాకు హైప్ క్రియేటవ్వలేదు. మామూలుగా షారుఖ్ సినిమా రిలీజవుతోందంటే ఉండే హైప్ దీనికి ఎంత మాత్రం లేదు. శుక్రవారం ఈ సినిమా విడుదలవుతున్న సంగతే చాలామందికి తెలియట్లేదంటే ఆశ్చర్యం లేదు. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. మొత్తానికి గత కొన్నేళ్లలో ఏ షారుఖ్ సినిమాకు లేనంత తక్కువ హైప్ ఉంది ఈ సినిమాకు. మరి ఈ పరిస్థితుల్లో సినిమాకు టాక్ తేడాగా వచ్చిందంటే అంతే సంగతులు. మరి ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News