బాలీవుడ్ బాద్ షా.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా ఆయన సినిమా ప్రమోషన్ లో భాగంగా పదే పదే మీడియా ముందుకు రావడంతో పాటు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తాజాగా మరోసారి అభిమానులతో ట్విట్టర్ ద్వారా చిట్ చాట్ చేశాడు.
ఆ సందర్భంగా ఒక అభిమాని రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు అంటూ ప్రశ్నించగా షారుఖ్ స్పందిస్తూ.. చరణ్ నాకు పాత స్నేహితుడు. అతడు నా పిల్లలకు చాలా ఇష్టం అన్నట్లుగా ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్ యొక్క ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రామ్ చరణ్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా సన్నిహితుడు అనే విషయం తెల్సిందే. మెగా ఫ్యామిలీ తో ఉన్న అనుబంధం తో గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ ను పాత స్నేహితుడు అంటూ సంబోధించిన షారుఖ్ ఖాన్ ముందు ముందు మెగా కొలబ్రేషన్ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి.
రామ్ చరణ్ నటించిన ఒక సినిమా షూటింగ్ కు గతంలో షారుఖ్ ఖాన్ వెళ్లి సందర్శించడంతో పాటు చిత్రంకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నాడు. ఇప్పటికి కూడా స్నేహం కొనసాగుతుందా అనేది క్లారిటీ లేదు. తన పాత స్నేహితుడు అంటూ షారుఖ్ ట్వీట్ చేయడం తో ఇప్పుడు స్నేహితుడు కాదా అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.