ఆయన 90 కోట్లడిగాడు..ఈయన 10 కోట్లకు ఓకే

Update: 2016-09-10 07:30 GMT
ఒక సినిమాకు 90 కోట్ల బడ్జెట్ అన్నా ఆశ్చర్యపోయేవాళ్లు కొన్నేళ్ల కిందటి వరకు. కానీ ఇప్పుడు ఒక హీరో తన పారితోషకంగా రూ.90 కోట్లు అడిగే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమా ‘పద్మావతి’ కోసం అడిగిన పారితోషకమిది. ఇంతకుముందు షారుఖ్ తో ‘దేవదాసు’ లాంటి మంచి సినిమా తీసిన బన్సాలీ.. ఆ చనువుతోనే మరోసారి తన సినిమాలో నటించమని అడిగాడట. ఐతే ఏడాది పాటు ఈ సినిమాకు డేట్లు కేటాయించాల్సి ఉండటంతో షారుఖ్.. అన్ని లెక్కలూ వేసుకుని తన మార్కెట్ ప్రకారం రూ.90 కోట్ల పారితోషకం ఇవ్వాల్సి ఉంటుందని మొహమాటం లేకుండా చెప్పేశాడట. ఐతే హీరోకే అంతిచ్చేస్తే సినిమాకు ఏం పెడతాం అనుకుని షారుఖ్ కు ఓ దండం పెట్టేశాడట బన్సాలీ.

ఇద్దరు హీరోలు నటించే ఈ సినిమాకు రణ్వీర్ సింగ్.. షాహిద్ కపూర్ లను హీరోలుగా ఎంచుకున్నాడు బన్సాలీ. రణ్వీర్ సింగ్ పారితోషకం ఎంతో కానీ.. షాహిద్ కపూర్ కు మాత్రం రూ.10 కోట్లే ఇస్తున్నాడట బన్సాలీ. షారుఖ్ కోసం అడిగిన పాత్రకే షాహిద్ ను తీసుకున్నారట. గత ఏడాది షారుఖ్ ఖాన్ సినిమా ‘దిల్వాలే’కు పోటీగా తన ‘బాజీరావు మస్తానీ’ని వదిలాడు బన్సాలీ. షారుఖ్ ఎంత స్టార్ అయితేనేం.. కంటెంట్ ఉన్న ‘బాజీరావు మస్తానీ’నే బాక్సాఫీస్ రేసులో గెలిచింది. ఈ నేపథ్యంలోనే స్టార్లు ఉన్నా లేకున్నా కంటెంటే కీలకమని రుజువు కావడంతో షారుఖ్ సంగతి లైట్ తీసుకుని ముందుకెళ్లిపోతున్నాడు బన్సాలీ. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను దీపికా పదుకొనే పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News