బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అనడంలో సందేహం లేదు. ఆయన హీరోగా సక్సెస్ అవ్వడం కు ముందు ఆయన పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెల్సిందే. తినడానికి కూడా ముంబయిలో ఒకప్పుడు ఇబ్బంది పడ్డ షారుఖ్ ఖాన్ ఇప్పుడు ముంబయిలో అత్యంత ఖరీదైన ఒక భవనంలో ఫ్యామిలీతో ఉంటున్నాడు. అందుకే ఆయన అంటే ప్రతి ఒక్కరికి గౌరవం మరియు అభిమానం అనడంలో సందేహం లేదు. అలాంటి అభిమానంను దక్కించుకున్న షారుఖ్ ఖాన్ పరువు ను ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్ గంగపాలు చేశాడు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ తండ్రిని జైలు వరకు వచ్చేలా చేశాడు. ఆర్యన్ ఖాన్ చేసిన తప్పిదం వల్ల షారుఖ్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆర్యన్ ఖాన్ వ్యవహారం మెల్ల మెల్లగా కుదుట పడుతున్నట్లుగా ఉంది. జైలు నుండి బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ కేసు త్వరలోనే కొట్టి వేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ కూడా కొడుకు వివాదాలు సమసి పోతున్న నేపథ్యంలో మునుపటి స్థితికి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే తన తాజా చిత్రం పఠాన్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతే కాకుండా షారుఖ్ కమర్షియల్ యాడ్స్ షూట్ లో కూడా పాల్గొంటున్నాడు. తాజాగా ఎల్ జీ యాడ్ షూట్ లో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేయడం జరిగింది.
ఇక సోషల్ మీడియాలో ఇంతకు ముందు చాలా యాక్టివ్ గా ఉండే షారుఖ్ ఖాన్ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నాడు. దాదాపు నాలుగు నెలల నుండి ఇన్ స్టా గ్రామ్ లో ఆయన ఒక్క పోస్ట్ ను కూడా షేర్ చేయలేదు. దాదాపుగా 28 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న షారుఖ్ ఖాన్ కొన్ని నెలలుగా ఎలాంటి పోస్ట్ లు షేర్ చేయక పోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన నుండి ఎట్టకేలకు ఒక ఇన్ స్టా పోస్ట్ వచ్చింది. ఒక ఎల్ జీ కి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో మళ్లీ షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతారనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఆయన సినిమాఉల కూడా విడుదల కాబోతున్నాయి.