వ్కోడ్కా బిజినెస్ లోకి దిగుతోన్న షారుక్ ఖాన్ త‌న‌యుడు!

Update: 2022-12-13 13:30 GMT
బాద్ షా షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ తండ్రిలా కాకుండా! క్రియేటివ్ గా ముంద‌కెళ్తున్న సంగ‌తి తెలిసిందే. మ్యాక‌ప్ వేసుకుని కెమెరా ముందుకెళ్ల‌డం క‌న్నా? అదే మ్యాక‌ప్ ని మ‌రో హీరో కి వేసి తాను వెనుకుండి ఆహీరోని ముందుకు న‌డిపించ డం అంటేనే ఆర్య‌న్ కి ఇష్టం. అంత‌కు మంచి తండ్రినే డైరెక్ట్ చేయాల‌న్న‌ది  అతని డ్రీమ్ గా క‌నిపిస్తుంది.

అందుకే నేను హీరోని కాను..దర్శ‌కుడిని అవుతాన‌ని గ‌ట్టిగానే చెప్పాడు.  ఈ విష‌యాన్ని గ‌త వార‌మే మ‌రోసారి బాలీవుడ్ మీడియా ముందు సైతం గుర్తు చేసాడు . అంటే ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌కుడు అవ్వ‌డం విష‌యంలో ఎంత క‌మిట్ మెంట్ తో ఉన్నాడో అర్ధ‌మ‌వుతోంది. కుర్రాడి అని లైట్ గా తీసుకుంటార‌నే! మ‌రోసారి గుర్తుచేసాడు. తాజాగా ద‌ర్శ‌కుడిగా మార‌క ముందే తాను పెద్ద బిజినెస్ మ్యాన్ ని అనిపించుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఆర్య‌న్ ఖాన్ త‌న స్నేహితుల‌తో క‌లిసి వోడ్కా మ‌ద్యం వ్యాపారంలోకి దిగుతున్నాడు. ప్రీమియం వోడ్కా బ్రాండ్ ను దేశంలోని మద్యం బాబులకు పరిచయం చేస్తున్నాడు. ఈ వ్యాపారం కోసం ఆర్యన్ ఖాన్.. అతడి సన్నిహితులు ఓ బెవరేజెస్ కంపెనీతో ఒప్పందం  కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఆర్యన్ తన భాగస్వాములైన బంటీ సింగ్...లేటి బ్లోగవా తో కలసి ప్రీమియం వోడ్కా బ్రాండ్ ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్టు మింట్ పత్రిక లో ఓ వార్త వ‌చ్చింది.

`శ్లాబ్ వెంచర్స్` అనే పేరుతో ఓ కంపెనీని సైతం ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బేవరేజీ కంపెనీ అయిన ఏబీ ఇన్ బెవ్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. శ్లాబ్ వెంచర్స్ ఉత్పత్తులను ఇన్ బెవ్ మార్కెటింగ్ చేస్తుంది. మార్కెట్లో శూన్యత ఆవరించి ఉండడం అదనపు ఆవిష్కరణలకు అనుకూలంగా ఉంద‌ని  ఆర్యన్ ఖాన్ మార్కెట్ స్ర్టాట‌జీ గురించి చెప్పాడు.

ఆర్య‌న్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి   సంపన్న మద్యం బాబులను ఆర్యన్ ఖాన్ అండ్కో కంపెనీ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మొత్తానికి ఆర్య‌న్ ఖాన్ స‌క్సెస్ ఫుల్ బిజినెస్లోకే దిగుతున్నాడు. మ‌ద్యం డిమాండ్ డే బై డే పెరుగుతుందే ! త‌గ్గింది లేదు. అలాగే   ఆర్య‌న్ డైరెక్ట‌ర్ కాక‌ముందే బిజినెస్ లోకి దిగ‌డం బాలీవుడ్ మీడియాలో ఆస‌క్తిక‌రంగా మారింది.  వ్యాపారాన్ని స్నేహితుల‌కు అప్ప‌గించి తాను డైరెక్ట‌ర్ గా బిజీ అవ్వాల‌న్న‌ది...కంపెనీ ద్వారా వ‌చ్చే లాభాల‌తో సినిమాలు చేయాల‌న్న‌ది ఆర్య‌న్ ప్లాన్ క‌నిపిస్తుంది.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News