కొడుకును సరైన దారిలో పెట్టలేకపోయిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు దిద్దుబాట పట్టాడు. కొడుకు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ కేసులో ఇరుక్కొని 27 రోజులు జైలు జీవితం అనుభవించాక ఇప్పుడు తేరుకున్నారు. ఆర్యన్ ఖాన్ కు, ఆయన తండ్రి షారుఖ్ ఖాన్ ఈ పరిణామం ఎప్పుడూ లేని విషాదాన్ని కలిగింది. గతంలో ఎప్పుడూ కోర్టులు, జైళ్లు, బెయిల్ సంగతి తెలియని షారుఖ్ ఖాన్ తన కుమారుడి వల్ల లాయర్లతో గంటలు గంటలు గడపాల్సి వచ్చింది.నానా తంటాలు పడి చచ్చీ చెడితే కానీ బెయిల్ రాలేదు.
ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న ఆర్యన్ ఖాన్ విషయంలో ఇక స్టిక్ట్ గా ఉండాలని షారుఖ్ ఖాన్ డిసైడ్ అయ్యాడట.. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ వివాదాస్పద సెలబ్రెటీ కావడంతో అతడిపై మీడియా, అందరి ఫోకస్ ఉంటుంది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కు కొత్త సమస్య వచ్చిపడిందట.. ఆర్యన్ భద్రత ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు ఆర్యన్ ఎటు వెళ్లాలన్నా సెక్యూరిటీ తప్పనిసరైంది.
ప్రస్తుతానికి 24 ఏళ్ల స్టార్ కిండ్ కు రవి సింగ్ బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్నాడు. అతడు నిజానికి షారుఖ్ ఖాన్ బాడీగార్డ్. ఎన్నో ఏళ్లుగా కింగ్ ఖాన్ కుటుంబంలో తనూ ఒకడిగా కలిసిపోయాడు. రవిసింగ్ ఎప్పుడూ షారుఖ్ ఖాన్ పక్కనే ఉంటాడు.
కానీ డ్రగ్స్ కేసులో ఆర్యన్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు రవిసింగ్.. ఆర్యన్ ఖాన్ సంరక్షణ చూసుకుంటున్నాడు. మీడియా, సామాన్య జనం ఎగబడుతుండడంతో ఆర్యన్ కు బాడీగార్డ్ అవసరం ఏర్పడింది. లేకుంటే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఏర్పడింది.
ఆర్యన్ ఖాన్ కు తన బాడీగార్డ్ వెళ్లిపోవడంతో ఇప్పుడు షారుఖ్ కు కూడా సెక్యూరిటీ అవసరం ఏర్పడింది. అందుకే నమ్మదగ్గ సెక్యూరిటీ కోసం షారుఖ్ వేటలో ఉన్నాడట..
ఈ విషయం తెలిసిన చాలా సెక్యూరిటీ ఏజెన్సీల వారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కుప్పలు తెప్పలుగా అప్లికేషన్లు పంపుతున్నారట..
షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్' వెబ్ సైట్ కు ఇప్పటికే బోలెడన్నీ బాడీగార్డ్ బయోడేటాలు వచ్చేశాయట.. ఇంకా సీనియర్ ఖాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ.. త్వరలో షారుఖ్ ఇల్లు 'మన్నత్'లోకి కొత్త బాడీ గార్డ్ రావడం ఖాయం అంటున్నారు. మరి ఆర్యన్ కోసం వచ్చే ఆ కొత్త బాడీగార్డ్ ఎవరు? ఎంత జీతం ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది.