షారుక్ కు టైమివ్వ‌లేనంత బిజీనా గౌరీ?

Update: 2018-10-26 01:30 GMT
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. అత‌గాడి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాలు కొట్టినా.. అత‌డ్ని కొట్టేసి ముందుకు వెళ్లేంత సీన్ బాలీవుడ్‌లో ఎవ‌రికీ లేదంతే. ప్ర‌స్తుతం జీరో సినిమా చేస్తున్న షారుక్ ఈ సినిమా మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో తీస్తున్న ఈ మూవీ ఈ డిసెంబ‌రు మూడో వారంలో విడుద‌ల కానుంది. క్రిస్ మ‌స్ కానుక‌గా రానున్న ఈ మూవీ విభిన్న‌మైన క‌థ‌నంతో రానుంద‌ని చెబుతున్నారు.

షారుక్ లాంటోడు నోరు తెరిచి త‌న‌కు ఇది కావాలి? అని అడ‌గాలే కానీ.. నో చెప్పే వారు ఉంటారా?  వాయు వేగంతో బాద్షా కోరింది తీర్చే ప్ర‌య‌త్నం చేస్తారు.కానీ.. తాజాగా షారుక్ నోరు తెరిచి అడిగినా.. పెద్ద‌గా ఎగ్జై్ట్ కాక‌పోవ‌ట‌మే కాదు.. నాకు టైం ఉన్న‌ప్పుడు చేస్తాన‌న్న మాట ఆస‌క్తిక‌రంగానే కాదు వైర‌ల్ గా మారింది.

ఇంత‌కీ షారుక్ కోరింది అంత సింఫుల్ గా తేల్చేసింది మ‌రెవ‌రో కాదు.. ఆయ‌న స‌తీమ‌ణి గౌరీఖాన్‌. ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌లోకి వెళితే.. బాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీ ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ల‌లో ఒక‌రు గౌరీ ఖాన్. ఆమె క్ల‌యింట్స్ గా ర‌ణ్ బీర్.. క‌ర‌ణ్ జోహార్‌.. జాక్వెలీన్ ఫెర్నాండెజ్ లాంటి పెద్ద పెద్ద సెల‌బ్రిటీలు ఉంటారు.

తాజాగా ఆమె ఒక ప్ర‌ముఖ కాస్మోటిక్ బ్రాండ్ కోసం ఇటీవ‌ల ఒక డిజైన్ ను త‌న స్టూడియోలో త‌యారు చేశారు. దానికి సంబంధించిన పిక్ ను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. స‌ద‌రు బ్రాండ్ గురించి చెప్పి.. దాని కోసం తాను స్టూడియోను డిజైన్ చేశాన‌ని..అందులో అమ్మే కాస్మోటిక్స్ ధ‌ర‌లు అంద‌రూ కొన‌గ‌లిగే స్థాయిలో ఉంటాయంటూ ప్ర‌చారం మొద‌లెట్టేసింది.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌ముఖులు కొన్ని కంపెనీల‌తో టై అప్ కావ‌టం.. ఆ బ్రాండ్స్ కు సంబంధించి చిన్న చిన్న పోస్టులు సోష‌ల్ మీడియాలో పెట్ట‌టం ద్వారా భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారం కూడా దాదాపుగా అలాంటిదేన‌న్న మాట వినిపిస్తోంది.

గౌరీ పెట్టిన పోస్టుకు షారుక్ స్పందిస్తూ.. మ‌రి నా ఆఫీస్ ను ఎప్పుడు డిజైన్ చేస్తావని ప్ర‌శ్నించారు. దీనికి స్పందించిన ఆమె.. నాకు టైం ఉన్న‌ప్పుడు అంటూ బ‌దులిచ్చారు. ఏంటి?  అంత పెద్ద షారుక్ అడిగితే.. టైం కుదిరిన‌ప్పుడు అంటారా?  మీరు అంత బిజీనా అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు వ‌స్తున్నాయి.

మిగిలిన ముచ్చ‌ట ఎలా ఉన్నా.. త‌న పోస్ట్‌ ను వైర‌ల్ చేసుకోవ‌టంలో గౌరీ స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి. ఆమె పోస్ట్ వైర‌ల్ అయితే.. ఆమె బ్రాండ్ చేసిన ఉత్ప‌త్తుల పేర్లు కూడా అంద‌రి దృష్టికి వెళ‌తాయి క‌దా? ఆ కంపెనీకి.. గౌరీకి కావాల్సింది ఇదే. లేకుంటే భార్య‌ను త‌న ఆఫీసును డిజైన్ చేయ‌మ‌ని భ‌ర్త ఇంట్లో అడ‌గొచ్చుగా..? అది వ‌దిలేసి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టటం వ్యూహాత్మ‌కంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌జ‌ల‌తో ప్ర‌ముఖులు ఎంత సింఫుల్ గా బిజినెస్ చేస్తార‌న‌టానికి తాజా ఉదంతం చిన్న ఎగ్జాంఫుల్ మాత్ర‌మే అన్న అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియా అన‌లిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News