బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన 'రయీస్' రిలీజ్ సమయంలో నెలకొన్న వివాదం అప్పట్లో ఎంత సంచలనమైందో తెలిసిందే. షారుక్ చేసిన పనికి అభిమాని మరణించడంతో దేశవ్యాప్తంగా షారుక్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై కేసు నమోదవ్వడం..కోర్టులో విచారణకు హాజరు కావడం వంటివి జరిగాయి.
తాజాగా ఈ వివాదం పై షారుక్ కి కోర్టు నుంచి ఊరట లభించింది. షారుక్ చర్యని తప్పుబట్టడానికి ఎంత మాత్రం వీలు లేదని కోర్టు తీర్పునిచ్చింది. గుజరాత్ లోని జస్టిస్ కారియల్ హైకోర్టు ధర్మాసనం ఈ సంచలన తీర్పునిచ్చింది. షారుక్ ఖాన్ చర్యలు జనాల్ని ఉత్తేజపరిచి ఉండొచ్చు. కానీ అవి నిర్లక్ష్యంగా చేసిన చర్యలు మాత్రం కావు.
తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆపని చేసాడు. అంతేకానీ అందులో షారుక్ ఉద్దేశ పూర్వకంగా చేసిందేమి లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో దోషిగా ఉన్న షారుక్ ఇప్పుడు నిర్దోషి అయ్యాడు.
ఓసారి ఆ వివాదం పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2017 లో షారుక్ ఖాన్ నటించిన 'రయీస్' రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ సమయంలో సినిమా కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో షారుక్ ముంబై నుంచి ఢిల్లీకి రైలు లో ప్రయాణం చేసారు. అంతేకాకుండా ప్రయాణం మధ్యలో గుజరాత్ లోని వడోదరలో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ని ఉత్తేజపరిచేందుకు కొన్ని టీషర్ట్ లు..స్మైలీ బాల్స్ వారి మీదకి విసిరారు. ఈ క్రమంలో అభిమానులు ఎగబడ్డారు. కింద పడి ఒకర్ని ఒకరు తొక్కుకున్నారు.
దీంతో తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన వడోదర నివాసి జితేంద్ర సోలంకి షారుక్ పై పిబ్రవరి 2017 లో కేసు నమోదు చేసాడు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. తాజాగా తుది తీర్పు వెలువడినట్లు తెలుస్తోంది.