లతాజీ పాదల వద్ద షారుఖ్‌ ఉమ్మేశాడు.. అసలు విషయం ఇదే

Update: 2022-02-08 04:06 GMT
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి వార్త దేశ వ్యాప్తంగా సంగీత ప్రియులను దుఃఖం లో ముంచి వేసింది. 92 ఏళ్ల లతా జీ ఎన్నో అద్భుతమైన పాటలు పాడి దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియన్‌ సినీ అభిమానులను మాత్రమే కాకుండా విదేశీయులను కూడా తన గాత్రంతో అలరించిన ఘనత లతా జీ కి మాత్రమే దక్కింది అనడంలో సందేహం లేదు. అంతటి గొప్ప వ్యక్తి అంత్య క్రియల సందర్బంగా షారుఖ్‌ ఖాన్‌ చేసిన పని వైరల్‌ అయ్యింది. అయితే కొందరు ఆ పనిని అర్థం చేసుకుని ప్రశంసిస్తే మరి కొందరు మాత్రం అర్థం కాక విమర్శలు చేస్తున్నారు. అతడు చేసిన ఒకే పని రెండు రకాలుగా కనిపించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది.

షారుఖ్‌ ఖాన్‌ లతాజీ అంత్య క్రియలకు హాజరు అయ్యి ఆమె పాదాల వద్ద ఉమ్మి వేయడం ను కొందరు గమనించారు. ఆ విషయమై సోషల్‌ మీడియాలో షారుఖ్‌ ఖాన్‌ పై పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. లెజెండ్రీ సింగర్‌ లాస్ట్‌ జర్నీ సమయంలో షారుఖ్‌ ఇలా చేయడం సిగ్గు చేటు అంటూ ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే షారుఖ్ ఖాన్‌ లతాజీ ఆత్మకు శాంతి చేకూరేలా ప్రార్థన చేశాడు. ముస్లిం మత ఆచారం ప్రకారం నవాజ్ ను చదివి ఆ తర్వాత ఆమె పాదాల వద్ద నోటితో మాస్క్‌ తీసి గాలి ఊదాడు. అంతే తప్ప ఉమ్మి వేయలేదు అంటూ ఫ్యాక్ట్ చెక్‌ అంటూ సోషల్‌ మీడియా లో అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు.

లతాజీ పై షారుఖ్‌ ఖాన్‌ కు అమితమైన గౌరవం ఉంది. అందుకే ఆయన సుదీర్ఘ కాలం తర్వాత బయటకు వచ్చారు. కొడుకు అరెస్ట్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత షారుఖ్‌ ఖాన్‌ పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. కాని లతాజీ మరణం ఆయనను కలచి వేసింది. అందుకే ఆమె చివరి చూపు కోసం అక్కడకు చేరుకున్నారు. అంతే కాకుండా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లిం మత ఆచారం ప్రకారం నవాజ్ ను చదివాడు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న హీరోను పట్టుకుని ఉమ్మి వేశాడు.. నవాజ్ చదివాడు అంటూ విమర్శలు చేయడం విచారకరం అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయినా లతాజీ పై ఉమ్మి వేశాడు అంటూ కొందరు ఊహించుకోవడం వాళ్ల తెలివి తక్కువ తనం గా చెప్పుకోవాలి. అంత మంది ముందు ఏ ఒక్కరు కూడా అలా చేయరు. షారుఖ్‌ అలా ఎందుకు చేశాడు అనేది తెలియకుంటే వదిలేయాలి కాని ఆయన ఉమ్మి వేశాడు అంటూ ప్రచారం చేయడం వారి అవివేకం అంటూ నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News