అక్రమ ఆస్తి కేసులో షారుఖ్ ఖాన్ మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తున్నాడు. షారుఖ్ సొంతం చేసుకున్న 20 వేల గజాల అలీబాగ్ ప్లాట్లను నకిలీ పత్రాలతోనే కొనుగోలు చేసినట్లు స్పష్టమైంది. షారుఖ్ సన్నిహితుడు.. అతడికి ఛార్టెడ్ అకౌంటెంటుగా కూడా పని చేస్తున్న మోరేశ్వర్ అజ్గాంకర్ తన యజమానిని ఇరుకున పెట్టేలా ఐటీ అధికారుల దగ్గర వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. తాను అలీబాగ్ ప్లాట్లను నకిలీ పత్రాలతో షారుఖ్ సూచనలతోనే కొనుగోలు చేసినట్టు మోరేశ్వర్ ఐటీ అధికారుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది.
షారుఖ్ వ్యవసాయం కోసమని అలీబాగ్ ప్లాట్లను కొన్నాడు. ఐతే ఈ స్థలాన్ని వ్యవసాయం కోసం ఉపయోగించలేదు. అక్కడ విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మించడంతోపాటు.. స్విమ్మింగ్ పూల్.. ప్రైవేట్ హెలిపాడ్.. ఆర్టిఫిషియల్ బీచ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రాపర్టీకి తన బంధువుల్ని డైరెక్టర్లుగా నియమించి సర్వాధికారాల్ని తనే ఉంచుకున్నాడు. ఈ ఆస్తికి సర్కిల్ రేటు రూ.15 కోట్లు కాగా.. మార్కెట్ విలువ ఐదు రెట్ల దాకా ఉంటుందని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్తిని ప్రస్తుతం ఐటీ శాఖ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి షారుఖ్ నేరం రుజువైతే.. ఆరు నెలల నుంచి ఏడేళ్ల దాకా శిక్ష.. ఆస్తిలో 10 శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. షారుఖ్ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అతడికి శిక్ష పడి జైలుకు వెళ్తాడేమో అని అభిమానుల్లో కంగారు మొదలైంది.