ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. బాలీవుడ్ బాద్ షా కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకుంటున్న ‘ఫ్యాన్’ ఆగమనం శుక్రవారమే. ఈ ఏడాది హిందీలో రిలీజవుతున్న ఫస్ట్ బిగ్ మూవీ ఇదే అని చెప్పాలి. బాలీవుడ్లో ఎన్ని సినిమాలు వచ్చినా.. ఖాన్ ల సినిమా అంటే ఆ ఊపే వేరు. ఖాన్ త్రయంలో ఈసారి ముందు బోణీ కొట్టబోతోంది షారుఖ్ ఖానే. మనీష్ శర్మ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4600 థియేటర్లలో రిలీజవుతుండటం విశేషం.కేవలం ఇండియాలో మాత్రమే 3500కు పైగా థియేటర్లలో రిలీజవుతున్న ఈ సినిమా.. అంతర్జాతీయ స్థాయిలో 1100 థియేటర్లలో సందడి చేయబోతోంది.
ఓపక్క అమీర్ ఖాన్ తనదైన శైలిలో మంచి సినిమాలు చేస్తూ ఇంతింతై అని ఎదిగిపోతున్నాడు. ఈ మధ్య సల్మాన్ కూడా రొటీన్ మసాలా సినిమాలు వదిలేసి కంటెంట్ ఉన్న సబ్జెక్టులపై దృష్టిపెట్టాడు. ఐతే షారుఖ్ మాత్రమే చెత్త సినిమాలతో రేసులో వెనుకబడిపోతున్నాడన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఫ్యాన్’ సినిమా విమర్శకులకు జవాబుగా నిలుస్తుందని షారుఖ్ ఆశిస్తున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఆర్యన్ ఖన్నా అనే సూపర్ స్టార్ గా.. గౌరవ్ అనే అతడి వీరాభిమానిగా ద్విపాత్రాభినయం చేశాడు. తాను అమితంగా ఆరాధించే హీరోకే ఓ అభిమాని ఎదురు తిరిగి అతడికి శత్రువుగా మారితే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.